సోమవారం, జులై 06, 2015

హొయ్‌నా ఏం చాందినిరా...

గోదావరి మీద హాయిగా సాగుతున్న పడవ ప్రయాణం, మనసుకు నచ్చిన చిన్నది పక్కనే ఉంది కానీ చిర్రుబుర్రు లాడుతోంది. అందుకే ఆమెని ప్రసన్నం చేస్కోడానికి పొగడ్తలతో ముంచెత్తాడా అమ్మాయిని. తనేమైనా తక్కువా తాను అందరాని చందమామనని చెప్పకనే చెప్పింది. గోదారి సాక్షిగా సాగిన ఆ కథేమిటో ఈ పాటతో మీరే తెలుసుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆట (2007)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్ , చిత్ర

ఒలియో ఒలియో హొరెత్తావే గోదారీ
ఎల్లువై తుళ్ళావిలా గట్టుజారి
ఒలియో ఒలియో ఊరేగావే సింగారీ
ఇంతకీ ఏడుందే అత్తింటి దారీ

హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా
హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా

హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా

వగలమారి నావ, హొయలు మీరినావ,
అలలు ఊయలూగినావ
తళుకు చూపినావ, తలపు రేపినావ,
కలల వెంట లాగినావ
ఓఓఓఓఓ..ఓఓఓఓఓ
సరదాగ మితిమీరి అడుగే ఏమారి
సుడిలో పడదోసే అల్లరి
త్వరగా సాగాలి దరికే చేరాలి పడవా
పోదాంపద ఆగకేమరీ

హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా

ఓ..నీటిలోని నీడ చేతికందుతుందా
తాకిచూడు చెదిరిపోదా
గాలిలోని మేడ మాయలేడికాద
తరిమిచూడు దొరుకుతుందా
ఓహోహోఓఓఓఓ..ఓఓఓఓఓ...
చక్కానిదానా చుక్కానికానా నీ చిక్కులన్నీ దాటగా
వద్దూ అనుకున్నా వదలను నెరజాణా 
నేనే నీ జంటని రాసి ఉందిగా

హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్‌నా వెన్నెల నదిరా హొయ్‌నా వన్నెల నిధిరా
హొయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా హొయ్‌నా


4 comments:

యెంకి పాటంటి అందమైన పాట..

అవునండీ థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

థాంక్స్ అజ్ఞాత గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.