బుధవారం, జులై 22, 2015

గోదావరి పయ్యెదా...

గోదావరి ఒడ్డున తన ప్రేయసిని కలుసుకున్న ఈ కుర్రాడికి ఆమె పైట గోదావరిలా మెలికలు తిరుగుతూ కనువిందు చేసిందట ఇక తన వాలు జడేమో నల్లని కృష్ణమ్మలా ఇంత బారున సాగిందట ఇక ఆగుతాడా.. వేటూరి వారి సాయంతో ఇలా కమ్మనైన పాట పాడుకున్నాడు. తేట తెలుగు పదాల పాట వింటూంటే డబ్ చేసినది అనే స్పృహే రాదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బాంబే రవి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

ఆఆఆఅ..ఆఆఆ....ఆఆఅ..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
ఓ..ఓ..ఓఓఓఓఓ....
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో.. 
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో.. 

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా
నిండారి తెలుగింటి అందాలే వెలిగించే
నండూరి వారెంకిలా ఓ...

గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ
ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ

సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము...ఓఓ..
సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము
ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము
నన్నల్లుకోమంది వయ్యారము
కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో
నా స్వప్న లోకాలలో..ఓయ్.ఒయ్.ఒయ్..

గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
కవ్వాలే కడవల్లో కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో తుంటరి ఓతుమ్మెదవో
నా బాహు బంధాలలో..ఓయ్.ఓయ్..

గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...
గోదావరి పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో.. 
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
ఓ..ఓ..ఓఓఓఓఓ....
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో.. 
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..




2 comments:

ప్రేమకీ పరువానికీ ప్రకృతికీ ఉన్న అనుబంధం ఈనాటిదా..అందులోనూ శాంత గంభీరమైన సంద్రాన్ని పురుషుడితో, పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే నదులని స్త్రీ తో పోల్చని కవులున్నరా..అమ్మాయి అలిగితే అలకనంద..కినుకగా చూస్టే కావేరి..సొగసులు పోతే స్వర్ణముఖి..నవ్వితే గంగమ్మ..నవరసాల క్రీష్ణవేణి..ఐతే గుండె మాత్రం గోదారేనట..యెంతైనా కోనసీమ అబ్బాయికదా..

ఆహా ఎంతందంగా పోల్చారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.