శుక్రవారం, జులై 10, 2015

పన్నెండేళ్ళకు పుష్కరాలు...

పుష్కరాలంటే పన్నెండేళ్ళకి ఒకసారి మాత్రమే వచ్చే పండుగ. ఆరోజుల్లో పెద్దలంతా పవిత్రంగా గోదావరి మాతను కొలవడమే కాదు, ఎక్కడెక్కడి బంధుమిత్రుల ఆగమనంతో నదీస్నానాలతో సందడీ కోలాహలాలతో సాగుతాయి ఈరోజులు. అలాంటి ఓ జంట సరిగంగ స్నానాలు మీరూ చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : త్రిశూలం (1982)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సుశీల

తం తననం తం తననం
తం తననం తం తననం
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు
ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో
పరువాలు కలవాలి తాపాలతో

తం తననం తం తననం
తం తననం తం తననం
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు
ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో
పరువాలు కలవాలి తాపాలతో

తం తననం తం తననం
తం తననం తం తననం

ముద్దుగా పుట్టాను పొదలలో పువ్వులాగా
దిద్దితే ఎదిగాను పలకలో రాతలాగా
అల్లరిగా జల్లులుగా కదిలావు ఏరులాగా
ఒంపులుగా సొంపులుగా కులికావు ఈడురాగా
ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా
తోడైనవాడితో కలిసిపోగా హా..
ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా
తోడైనవాడితో కలిసిపోగా
గలగలలుగ కిలకిలలుగ
తొలికలలుగ వడి సెలలుగ
గలగలలుగ కిలకిలలుగ
తొలికలలుగ వడి సెలలుగ
ఉరికాను నిన్ను చేరగా

తం తననం తం తననం
తం తననం తం తననం 
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు

మొక్కువై ముడుపువై ఉన్నావు ఇన్నినాళ్ళు
మక్కువై మనసువై తీర్చుకో మొక్కుబళ్ళు
మేలుకొని కాచుకొని వెయ్యైనవి రెండు కళ్ళు
చేరుకొని ఆనుకొని నడవాలి కాళ్ళు కాళ్ళు
చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
చెరిసగముగ సరిసమముగ
చిరుజగముగ చిరునగవుగ
చెరిసగముగ సరిసమముగ
చిరుజగముగ చిరునగవుగ
చేద్దాము కాపురాలు

తం తననం తం తననం
తం తననం తం తననం  
పన్నెండేళ్ళకు పుష్కరాలు
పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు
ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో
పరువాలు కలవాలి తాపాలతో
తం తననం తం తననం
తం తననం తం తననం 


3 comments:

హీరో హీరోయిన్ల జంపింగులు పక్కన పెడితే ఇది అప్పట్లో సూపర్ హిట్ సాంగండీ..వినడానికి హుషారుగా బావుంటుంది కూడా..

అవునండీ పాట చూడడానికంటే వినడానికి చాలా బాగుంటుంది.. ముఖ్యంగా చరణాల ట్యూన్ నాకు చాలా ఇష్టం. థాంక్స్ ఫర్ ద కామెంట్ :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.