ఆదివారం, జులై 12, 2015

కనపడ లేదా గోదారి తల్లి...

శక్తి ఉండీ తన బిడ్డల ఆకలి పూర్తిగా తీర్చలేకపోతున్నానంటూ గోదారి తల్లి బాధపడుతుందట. పోలవరం ప్రాజెక్టు గురించిన ఈ పాట ప్రతి ఒక్కరినీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు ఉరికిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : బన్నీ (2005) 
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : బాలు, కోరస్

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష

 
గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని
తల్లి బ్రతుకుదేనికని
బీళ్ళు నింపె నీళ్ళున్న సముద్రాన పడిపోయె
శాపం తనకెందుకని
బరువై దయకరువై తనువెలియై ఇక బలియై
బరువై దయకరువై తనువెలియై ఇక బలియై
ఉప్పుసాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక
వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక 
వెక్కివెక్కి పడుతున్నది వృధాగ కనుమూయలేక
ఆ అలల అలజడి ఓఓ.. ఆ తడిఆరని కంటితడి ఓఓ... 
ఆ అలల అలజడి ఆ తడిఆరని కంటితడి 
కనబడలేదా వినబడటంలేదా

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష

శిలా పలక లేసి మీరు ఎలా మరచిపోయారని
బాసరలో సరస్వతీ పీఠమెక్కి అడిగినది
ధుర్మదాంధులారా తెలుగు బిడ్డలకీ కర్మేందని
ధర్మపురిలో నారసింహ నాధం చేస్తున్నది
ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక
కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది
బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలను చరించి
భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది
పాపి కొండల గుండె ధారై ప్రవహించినది
ధవళేశ్వర కాటన్ మహాశైలి తలచినది
సిగ్గుపడండని కుటిల నాయకులని తిట్టినది
గుండె పగిలి నర్సాపూర్ సముద్రాన దూకినది

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ రక్తఘోష
ఓఓఓఓ..ఓఓఓఓఓ...ఓఓఓఓ..ఓఓఓఓఓ


2 comments:

ఈ భగీరధ ప్రయత్నం విజయవంతం కావాలని కోనసీమ లోని ప్రతి అణువు కోరుకుంటోందండీ..

అవును నిజమే శాంతి గారు... లాంగ్ పెండింగ్ ప్రోజక్ట్ ఇది పూర్తయితే చాలా బాగుంటుంది... థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.