శుక్రవారం, జులై 31, 2015

గుండెల్లో గోదారీ...

పన్నెండు రోజులు జరిగే పుష్కరాలు ఆర్రోజుల క్రితమే అయిపోతే మనం ఈ బ్లాగులో నెలరోజుల పాటు జరుపుకున్న గోదావరి పాటల పండుగ నేటితో ముగిసిపోనుంది. ఇన్ని రోజులు జరిగిన సంబరాలనీ సంతోషాలనీ  ఈ చివరి రోజు గుండె నిండుగా నింపుకుని ఇళయరాజా గారి సాయంతో ఈ చక్కని పాట రూపంలో పాడుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  చిత్రం : గుండెల్లొగోదారి సంగీతం : ఇళయరాజా సాహిత్యం : చంద్రబోస్ గానం : ఇళయరాజా ఏ.హే...తయ్యారె...

గురువారం, జులై 30, 2015

నీలో అల గోదారి...

గోదావరి ఒడ్డున ప్రేమకు ప్రేమ గీతాలకు కొదవేముంది.. ఇదిగో ఈ యువజంటని చూడండి తన ప్రేయసిలో గోదారి ని చూస్తే తన ప్రియుడిలో నీడనిచ్చే అందాల తోటలని చూసిందట ఆ ముచ్చటేమిటో మనమూ విందామా. ఈ పాటలో ఇళయరాజా గారి సంగీతం అచ్చంగా గోదావరి మీదనుండి వీచే పిల్లతెమ్మెరలా హాయిగా అలా అలా సాగిపోతూ ఎంతో బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ప్రేమ విజేత (1992) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : గానం : బాలు,...

బుధవారం, జులై 29, 2015

పాపి కొండల వెనుక...

నమ్మిన వారికి రాతిలో దేవుడు కనిపిస్తాడు, ఉవ్వెత్తున అలలతో ఎగసి పడుతూ సుడిగుండాలతో ఉరకలు పరుగులు తీసే గోదావరి లోనూ సేదతీర్చే చల్లదనం ఉంది. అలాగే మనిషి మాట మొరటైనా మనసు చల్లనైనదయ్యే అవకాశాలు లేకపోలేదు అది చూడగలిగిన మనసుకే కనిపిస్తుంది. ఇదిగో ఈ అమ్మాయికి అలాంటి ఓ చల్లని మనసు కనిపించిదట ఆ వివరం మనమూ విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : ఆడాళ్ళు మీకు జోహార్లు (1981) సంగీతం : కె.వి. మహదేవన్...

మంగళవారం, జులై 28, 2015

కిన్నెరసాని వచ్చిందమ్మ...

కోటలాంటి ఇంటి నుండి ఎక్కడికీ కదలక చిన్నతనం నుండీ ఒక పగిలిన కిటికీ గుండా ప్రపంచాన్ని చూస్తూ గడిపిన రాణివాసపు చిన్నది.. మొదటిసారిగా ఆ కోటను దాటి పల్లెను దాటి ప్రకృతితో మమేకమై గోదావరి పరవళ్లతో పోటీగా తుళ్ళిపడుతుంటే.. విశ్వనాథ వారి కిన్నెరసాని అతని కళ్ళెదుట నిలిచిందట. ఆ వైనమేమిటో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : సితార (1983)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : వేటూరిగానం : బాలు, ఎస్.పి.శైలజ...

సోమవారం, జులై 27, 2015

పున్నమి లాగా వచ్చి పొమ్మని...

పన్నెండేళ్ళకొక్క మారే వచ్చినా ఆ పుష్కరంకోసం గోదారమ్మ, ఆమెతో పాటు ఆమె ఒడిన సేద తీరుతున్న ప్రజలు ఎంతగా ఎదురు చూస్తారో తెలియనిది కాదు కదా. అలాగే ఈ కుర్రాడు తెలుగుదనానికి దూరమై పాశ్చాత్య పోకడలు పోతున్న తన నెచ్చెలి తిరిగి పదారణాల తెలుగమ్మాయిలా తనదరికి రావాలని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడో వేటూరి వారి తేటతెనుగు మాటల్లో మీరే వినండి.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : జడగంటలు (1984) సంగీతం : పుహళేంది...

ఆదివారం, జులై 26, 2015

గో గో రై రై గోదావరిపై...

గోదావరిపై హ్యాపీ అలలట.. గోదారమ్మతో ఆటలాడుకోగలుగుతుంటే ఆనందం కాక మరేముంటుంది అందుకే ఆ అలలని హ్యాపీ అలలనిపించారేమో వంశీ గారు. రామజోగయ్య శాస్త్రి గారి సాయంతో జీవితపు ఫిలాసఫీని ఒక చక్కని సరదా ఐన పాటతో ఎలా చెప్పేస్తున్నారో మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : గోపి గోపిక గోదావరి (2009) సంగీతం : చక్రి సాహిత్యం : రామజోగయ్యశాస్త్రి గానం : చక్రి, వంశీ గో గో తననన గో...

శనివారం, జులై 25, 2015

ఉప్పొంగెలే గోదావరి / ఉప్పొంగి పోయింది...

గోదావరి గురించి గోదారి మీద సాగే లాంచీలో ప్రయాణం గురించి వేటూరి వారు ఎంతో అందంగా వర్ణించిన ఈ పాట నాకు చాలా ఇష్టం. నేటితో పుష్కరాలకు వీడ్కోలు చెబుతూ మళ్ళీ పుష్కరమెప్పుడొస్తుందా అని ఎదురు చూపులు మొదలు పెడుతూ ఈ పన్నెండు రోజులూ పుష్కర శోభతో ఉప్పొంగిపోయిన గోదారమ్మను చూసి ఈ అందమైన పాట పాడుకుందామా.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : గోదావరి (2006) సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్ సాహిత్యం : వేటూరి...

శుక్రవారం, జులై 24, 2015

ఒడుపున్న పిలుపు...

అనుకోని పరిస్థితుల్లో కొంతకాలం ఊరికి దూరంగా ఉండాల్సొచ్చి వేదన పడుతున్న మనసుకు తిరిగి ఊరు వెళ్ళబోతున్నామనే కబురుకన్నా సంతోషమైనదేదైనా ఉంటుందా. అంతటి ఆనందాన్ని పంచుకోడానికి తాము పుట్టి పెరిగిన చల్లని గోదారి తల్లికన్నా వేరే ఎవరుంటారు చెప్పండి. అందుకే ఈ జంట తమ సంతోషాన్ని ఇంత అందమైన పాటతో ఇలా వ్యక్తపరుస్తున్నారు. ఆ సందడేమిటో మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : సిరి...

గురువారం, జులై 23, 2015

అదిగో అదిగో / ఏటయ్యిందె గోదారమ్మ..

ఎదురు చూసినంత సేపు పట్టలేదు పుష్కరాలు అప్పుడే చివరి మూడు రోజులకు వచ్చేశాయి. అందుకే మరోసారి ఆ గోదారమ్మ ఒడ్డున కొలువై ఉన్న రాములోరిని తలచుకుందామా. శ్రీరామదాసు చిత్రంలో భద్రుని చరితను గురించిన ఈ పాటకు కీరవాణి గారిచ్చిన సంగీతం కొన్ని చోట్ల తనువును పులకింప చేస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీరామదాసు (2006) సంగీతం : ఎం.ఎం.కీరవాణి సాహిత్యం : వేటూరి గానం : ఎస్.పి.బాలు, బృందం ఓం...

బుధవారం, జులై 22, 2015

గోదావరి పయ్యెదా...

గోదావరి ఒడ్డున తన ప్రేయసిని కలుసుకున్న ఈ కుర్రాడికి ఆమె పైట గోదావరిలా మెలికలు తిరుగుతూ కనువిందు చేసిందట ఇక తన వాలు జడేమో నల్లని కృష్ణమ్మలా ఇంత బారున సాగిందట ఇక ఆగుతాడా.. వేటూరి వారి సాయంతో ఇలా కమ్మనైన పాట పాడుకున్నాడు. తేట తెలుగు పదాల పాట వింటూంటే డబ్ చేసినది అనే స్పృహే రాదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : సరిగమలు (1994) సంగీతం : బాంబే రవి రచన : వేటూరి గానం : ఎస్.పి.బాలు, చిత్ర ఆఆఆఅ..ఆఆఆ....ఆఆఅ.. కొమ్మలో...

మంగళవారం, జులై 21, 2015

ఎల్లువొచ్చి గోదారమ్మా...

గోదారమ్మ సాక్షిగా చెట్టాపట్టాలేసుకుని పాటలు పాడుకుని ఏకమైన జంటలు ఎన్నో... వాటిలో ఈ అందమైన జంటను చూడండి వేటూరి వారి సాయంతో చమత్కారమైన పదాల అల్లికతో ఓ అందమైన పాట పాడేసుకుంటున్నారు మరి ఆ సరదా సంగతులేంటో మనమూ విందామా. పాటలను అందంగా చిత్రీకరించడంలో రాఘవేంద్రరావు గారి శైలి ప్రత్యేకం సన్నివేశానికి తగినట్లుగా బిందెలతో ఆర్టిస్టిక్ గా అరేంజ్ చేసి తీసిన తీరు అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం...

సోమవారం, జులై 20, 2015

కొండా కోనల్లో లోయల్లో...

పచ్చదనంలో ఏకమైన ఈ చిన్నవాడు గానాన్ని తనకి వరంగా ఇచ్చింది అందమైన ప్రకృతే అని తెలుపుతూ ఆ ఆనందాన్ని ఒక అందమైన పాటగా కూర్చి తోటి కుర్రాళ్ళతో ఎలా ఆడీ పాడుకుంటున్నాడో మీరూ చూసీ విని ఆనందించండి. సిరివెన్నెల గారి తేట తెలుగు సాహిత్యం అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : స్వాతి కిరణం (1992) సంగీతం : కె.వి.మహదేవన్ సాహిత్యం : సిరివెన్నెల గానం : వాణీ జయరాం, కోరస్ కొండా కోనల్లో లోయల్లో గోదారి...

ఆదివారం, జులై 19, 2015

గోదారి రేవులోన...

గోదావరి ఒడ్డున పెరిగిన ఈ అమ్మాయి గొప్పలూ కాబోయే వాడి గురించి మనసులో ఉన్న కోరికలూ కలిపి ఒక హుషారైన పాటకట్టి వినిపిస్తోంది. ఆ సందడేమిటో మీరూ వినండి మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : రుక్మిణి (1997) సంగీతం : విద్యాసాగర్ సాహిత్యం : సిరివెన్నెల  గానం : సుజాత  గోదారి రేవులోన రాదారి నావలోన  నా మాట చెప్పుకుంటు ఉంటారంటా  నా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కాని  నాలాంటి...

శనివారం, జులై 18, 2015

భద్రుని చరితం.. / కురిసే వెన్నెల్లో...

గోదావరి మహా పుష్కరాల సంధర్బంగా పాటలను తలచుకుంటూ గోదావరి ఒడ్డున కొలువైన భద్రాద్రి రాముడ్ని తలచుకోకుంటే ఎలా అందుకే ఆ భద్రుని చరితం ఈ రోజు గుర్తు చేసుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : అందాల రాముడు (1973) సాహిత్యం : ఆరుద్ర సంగీతం : కె.వి.మహదేవన్ గానం : రామకృష్ణ, రాఘవులు,   వంగల పట్టాభి భాగవతార్(వచనం) మా తల్లి గోదారి చూపంగ దారి పడవెక్కి భద్రాద్రి పోదామా భద్రాద్రి రాముణ్ణి...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.