బుధవారం, ఫిబ్రవరి 26, 2020

వాడుక మరచెదవేల...

పెళ్ళి కానుక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళికానుక (1960)
సంగీతం : ఏ.ఎం.రాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఏ.ఎం.రాజా, సుశీల 

వాడుక మరచెదవేల
నను వేడుక చేసెదవేల
నిను చూడని దినము
నాకోక యుగము
నీకు తెలుసును నిజము
నీకు తెలుసును నిజము

వాడుక మరువను నేను
నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము
నాకొక దినము
నీకు తెలుసును నిజము
నీకు తెలుసును నిజము


సంధ్య రంగుల చల్లని గాలుల
మధుర రాగము మంజుల గానము

 సంధ్య రంగుల చల్లని గాలుల
మధుర రాగము మంజుల గానము
 తేనె విందుల తీయని కలలు
మరచి పోయిన వేళ
ఇక మనకీ మనుగడ యేల
ఈ అందము చూపి డెందము వూపి
ఆశ రేపెద వేల ఆశ రేపెదవేల

సంధ్య రంగులు సాగినా
చల్ల గాలులు ఆగినా
సంధ్య రంగులు సాగినా
చల్ల గాలులు ఆగినా

కలసి మెలసిన కన్నులలోన
 
కలసి మెలసిన కన్నులలోన 
 మనసు చూడగ లేవా
మరులు తోడగ లేవా


వాడుక మరువను నేను
నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము
నాకొక దినము
నీకు తెలుసును నిజము
నీకు తెలుసును నిజము


కన్నులా ఇవి కలల వెన్నెలా
చిన్నె వన్నెల చిలిపి తెన్నులా
 
కన్నులా ఇవి కలల వెన్నెలా
చిన్నె వన్నెల చిలిపి తెన్నులా 
 మనసు తెలిసీ మర్మమేలా
ఇంత తొందర యేలా
ఇటు పంతాలాడుట మేలా
నాకందరి కన్నా ఆశలు వున్నా
హద్దు కాదనగలనా
హద్దు కాదనగలనా 

 
వాడని నవ్వుల తోడ
నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లొకము మరచి
ఎకమౌదము కలసీ
ఎకమౌదము కలసి
 

4 comments:

అందమైన ప్రేమ పాట..

అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

The pallavi is slightly different in the Tamil original song. Both versions are equally good.

AM Raja music is very good in this movie

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.