గురువారం, ఫిబ్రవరి 13, 2020

ఓహో గులాబి బాలా...

మంచి మనిషి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలుచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంచిమనిషి  (1964)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు, టి.చలపతిరావు  
సాహిత్యం : దాశరధి
గానం : పి.బి.శ్రీనివాస్ 

ఓ ఓ ఓ... గులాబి
ఓ ఓ ఓ... గులాబి
వలపు తోటలో విరిసిన దానా
లేత నవ్వులా వెన్నెల సోన

ఓహో గులాబి బాలా అందాల ప్రేమమాలా
సొగసైన కనులదానా సొంపైన మనసుదానా
నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో

ఓహో గులాబి బాలా అందాల ప్రేమమాలా

కొంటె తుమ్మెదల వలచేవు
జుంటి తేనెలందించేవు
కొంటె తుమ్మెదల వలచేవు
జుంటి తేనెలందించేవు
మోసం చేసి మీసం దువ్వే
మోసకారులకు లొంగేవు లొంగేవు

ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల

రూపం చూసి వస్తారు
చూపుల గాలం వేస్తారు
రూపం చూసి వస్తారు
చూపుల గాలం వేస్తారు
రేకులు చిదిమీ సొగసులు నులిమీ
చివరకు ద్రోహం చేస్తారు
చివరకు... ద్రోహం... చేస్తారు...

ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల
సొగసైన కనులదానా సొంపైన మనసుదానా
నీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో
ఓ ఓ ఓ... గులాబి ఓ ఓ ఓ... గులాబి

2 comments:

యెవ్వర్ గ్రీన్ సాంగ్..

అవును శాంతి గారు.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.