ప్రేమికుల రోజు సంధర్బంగా ప్రేమికులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాతాళ భైరవి చిత్రంలోని ఒ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పాతాళ భైరవి (1951)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : ఘంటసాల, లీల
ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్రమీక్షణమో ఓ..
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే...
ఎంత ఘాటు ప్రేమయో
ఎంత తీవ్రమీక్షణమో ఓ..
ఎంత ఘాటు ప్రేమయో
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే
నా మనసు మురిసెనే...
ఎంత ఘాటు ప్రేమయో
ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే
ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా మనసు నిలిచెనే
యెంత లేత వలపులో
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
ఈ జాబిలి ఈ వెన్నెల ఈ మలయానిలమూ
విరహములో వివరాలను విప్పి జెప్పెనే
ఎంత ఘాటు ప్రేమయో
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ఓ జాబిలి ఓ వెన్నెల ఓ మలయానిలమా
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే
ఎంత లేత వలపులో
ఎంత చాటు మోహములో ఓ..
ఎంత లేత వలపులో..
4 comments:
లవ్ జ్ యూనివర్సల్ యెండ్ యబౌ ఆల్..
అంతే కదండీ.. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా మారదు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
All-time classic song. This song is forever
అవును అజ్ఞాత గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.