శనివారం, ఫిబ్రవరి 22, 2020

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ...

ప్రేమించి చూడు చిత్రంలోని ఓ మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల

ఓ...ఓ....ఓ...ఓ....ఓ...ఓ...

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ

చూపులతోనే మురిపించేవూ
చూపులతోనే మురిపించేవూ
ఆటలతోనే మరిపించేవూ
ఆటలతోనే మరిపించేవూ
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా
పొరపాటైతే పలకనులే పిలవనులే
దొరకనులే.. ఊరించనులే..

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ

నా మనసేమో పదమని సరేసరే
నా మనసేమో పదమని సరే సరే
మర్యాదేమో తగదని పదే పదే
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
వాదాలెందుకులే అవుననినా కాదనినా
ఏమనినా.. నాదానివిలే..

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ

అహా...అహా..అహ..ఆ
ఓహొహొ.. ఓహో..ఓ..
ఊహుహు..ఊహు..ఊ..



4 comments:



చూపులతోనే మురిపిం
చే పసిడీ బుగ్గల వలచితి పడతి జిలే
బీ పాటలనాటల చెలి
మీ పరువంపు హొయలన్ సమీపము రావే :)


జిలేబి

థ్యాంక్స్ జిలేబి గారు.

పి.బి.శ్రీనివాస్ గారి వాయస్ నిజంగా వెన్నెలలో ముంచితీసినట్టే ఉంది..

వెన్నెలలో ముంచి తీసినట్లుగా ఆహా ఎంత బాగా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.