సోమవారం, ఫిబ్రవరి 24, 2020

పగలే వెన్నెల...

పూజాఫలం చిత్రంలోని ఓ మధురగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : యస్. జానకి

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల జగమే ఊయల

నింగిలోన చందమామ తొంగి చూచె
నీటిలోన కలువభామ పొంగి పూచె..
ఈ అనురాగమే జీవనరాగమై
ఈ అనురాగమే జీవనరాగమై
ఎదలో తేనెజల్లు కురిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల

కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసె
మురళి పాట విన్న నాగు శిరసునూపె
ఈ అనుబంధమే మధురానందమై
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా

పగలే వెన్నెల జగమే ఊయల

నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పికము పాడె
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పికము పాడె
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా

పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల
 

2 comments:

మనసుని టచ్ చేసే పాట..

అవునండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.