బుధవారం, ఫిబ్రవరి 12, 2020

తీరెను కోరిక...

కుంకుమరేఖ చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కుంకుమ రేఖ (1960)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, జిక్కీ

తీరెను కోరిక తీయతీయగా
హాయిగ మనసులు తేలిపోవగా
కలసి ప్రయాణం కలుగు వినోదం
కలలు ఫలించెను కమ్మకమ్మగా

తీరెను కోరిక తీయతీయగా
హాయిగ మనసులు తేలిపోవగా
కలసిప్రయాణం కలుగు వినోదం
కలలు ఫలించెను కమ్మకమ్మగా


ఊహాలలోనికి ప్రయాణము
ఉందామచటే నివాసము
ఊహాలలోనికి ప్రయాణము
ఉందామచటే నివాసము

తేనెలు కురిశాయి మన జీవితాన
తేనెలు కురిశాయి మన జీవితాన
చూసెడివారలు యీసుచెందగా

తీరెను కోరిక తీయతీయగా
హాయిగ మనసులు తేలిపోవగా
కలసిప్రయాణం కలుగు వినోదం
కలలు ఫలించెను కమ్మకమ్మగా


ఇలలో స్వర్గం ఇదే ఇదే
పాడేను నామది పదే పదే
ఇలలో స్వర్గం ఇదే ఇదే
పాడేను నామది పదే పదే

పాటకు నా మనసు పరవశమొంది
పాటకు నా మనసు పరవశమొంది
తన్మయమాయను తనివితీరగా

తీరెను కోరిక తీయతీయగా
హాయిగ మనసులు తేలిపోవగా
కలసిప్రయాణం కలుగు వినోదం
కలలు ఫలించెను కమ్మకమ్మగా  

2 comments:

చిన్నప్పుడు యే చిన్న సంతోషం కలిగినా..నేనూ అక్కా ఈ పాట పాడుకునే వాళ్ళం..

హహహహ అవునా బావుందండీ స్వీట్ మెమొరీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.