శుక్రవారం, ఫిబ్రవరి 21, 2020

కమనీయం కైలాసం...

మిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆ పరమశివుని స్మరించుకుంటూ దక్షయజ్ఞం చిత్రంలోని ఈ చక్కని పాట చూద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దక్షయజ్ఞం (1962)
సంగీతం : ఎస్.హనుమంతరావు  
సాహిత్యం : ఆరుద్ర
గానం : పి.సుశీల

కమనీయం కైలాసం
కాంతుని సన్నిధిని కలలు ఫలించి
కవితలు పాడెను సంతోషం
కమనీయం కైలాసం

తెమ్మెరలూదే పిల్లనగ్రోవి
తీయని తొలిరేయి తెలియని హాయి
తెమ్మెరలూదే పిల్లనగ్రోవి
తీయని తొలిరేయి తెలియని హాయి
తేనియ చిందేటి కెమ్మోవి తావి
తేనియ చిందేటి కెమ్మోవి తావి
తీర్చేనోయి తనివీ

కమనీయం కైలాసం

నీ ప్రేమ సుధలో నెలవంక చలువ
నిను చూసి వికసించె నా కంటి కలువ
నీ ప్రేమ సుధలో నెలవంక చలువ
నిను చూసి వికసించె నా కంటి కలువ
చేసెద చెలువార శృంగార సేవ
చేసెద చెలువార శృంగార సేవ
చేకొను పరమ శివా

కమనీయం కైలాసం
కాంతుని సన్నిధిని కలలు ఫలించి
కవితలు పాడెను సంతోషం
కమనీయం కైలాసం

2 comments:

మీకు..మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు..

థ్యాంక్స్ శాంతి గారూ.. మీక్కూడా శివరాత్రి శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.