గురువారం, ఫిబ్రవరి 20, 2020

రకరకాల పూలు...

బండరాముడు చిత్రం లోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బండరాముడు (1959)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి, కె.ప్రసాదరావు  
సాహిత్యం : ఆరుద్ర/కొసరాజు ? 
గానం : పిఠాపురం నాగేశ్వరరావు

ఒహోయ్...
రకరకాల పూలు
రంగురంగుల పూలు
ఓఓఓఓ...
భలే భలే పూలు
పసందైన పూలు

రకరకాల పూలు
అహ రంగురంగుల పూలు
ఓఓఓఓ...
భలే భలే పూలు
పసందైన పూలు

అందమైన పూలు
అసలు జాతి పూలు
కొత్త కొత్త పూలు
కోరుకొన్న పూలు

గుల్ గులాబీ బల్ చామంతీ
పూలంటే పూలు కావండీ
పూలంటే పూలు కావండీ
ముట్టుకుంటే వదలిపెట్టి పోలేరండీ
మీరు అంటుకుంటే
యిడిచి పెట్టి పోలేరండీ

రకరకాల పూలు
అహ రంగురంగుల పూలు
ఓఓఓఓ...
భలే భలే పూలు
పసందైన పూలు

సత్తెంగా సెపుతుండా
సౌకగానే యిత్తుండా
అరువు బేరం ఏమీ కాదూ
అయిపోతే అడగరాదూ

గుల్ గులాబీ బల్ చామంతీ
ముట్టుకుంటే వదలి పెట్టి పోలేరండీ
మీరు అంటుకుంటే
యిడిచి పెట్టి పోలేరండీ

రకరకాల పూలు
అహ రంగురంగుల పూలు
ఓఓఓఓ...
భలే భలే పూలు
పసందైన పూలు

వాడిపోని పూలు
వహ్వా వాసన గల పూలు
కులుకులాడి చేతి మీదుగ
కోసి తెచ్చిన పూలు
ముసలి యవ్వయైనా
కొప్పులో ముడుచుకుంటే నైనా
ఆ గుడ్డి గువ్వ ఐనా
తల్లో కూర్చుకుంటే నైనా 
కళ్ళల్లో బడి మెరిపిస్తుంది
పెళ్ళి కూతురై మురిపిస్తుందీ

గుల్ గులాబీ బల్ చామంతీ
ముట్టుకుంటే వదిలి పెట్టి పోలేరండీ
మీరు అంటుకుంటే
యిడిచి పెట్టి పోలేరండీ

రకరకాల పూలు
అహ రంగురంగుల పూలు
ఓఓఓఓ...
భలే భలే పూలు
పసందైన పూలు
 

4 comments:

యన్,టి.ఆఆర్ గారు అద్భుతం అంతే..

అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.