శనివారం, ఏప్రిల్ 09, 2016

నన్ను వదలి నీవు...

మహదేవన్ గారు స్వరపరచిన మంచిమనసులు చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : మంచి మనసులు (1962)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే..ఏ..ఏ..
పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ...

తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..

తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినము రానున్నదిలే..
ఓ…

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే

తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగా...
నీ మేని హొయలు నీలోని వగలు...
నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసి ఉయ్యాలలూగి...
ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
పైపైకి సాగే మేఘాలదాటి..
కనరాని లోకాలు కనగా...

ఆహా ఓహో ఉహు...ఆ… ఆ…ఓ…
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే..0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail