ఆదివారం, ఏప్రిల్ 10, 2016

ఓఓ..చిగురాకులలో చిలకమ్మ...

దొంగరాముడు చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : దొంగరాముడు (1955)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, జిక్కి

ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
చిన్న మాట వినరావమ్మ
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
మంచి మాట సెలవీవయ్య
 


పున్నమి వెన్నెల గిలిగింతలకు
పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరికావమ్మా
ఓఓఓఓఓ...ఓఓఓఓ.....
ఓ ఓ...చిగురాకులలో చిలకమ్మ

ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేనా
ఆఆఅ.ఆ.ఆఆఆఅ...
ఓ ఓ ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
 

వలచే కోమలి వయ్యారాలకు
కలసే మనసుల తియ్యదనాలకు
కలవా విలువలు సెలవీయ

 ఓఓఓఓఓ...ఓఓఓఓ.....
 ఓ ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ

పై మెరుగులకే భ్రమపడకయ్య
మనసే మాయని సొగసయ్య
గుణమే తరుగని ధనమయ్య

ఓ ఓ మరుమల్లెలలో మావయ్య
మంచి మాట సెలవీవయ్య
 


ఓ ఓ చిగురాకులలో చిలకమ్మ
చిన్న మాట వినరావమ్మ


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.