శుక్రవారం, ఏప్రిల్ 22, 2016

ఓ మై లవ్...

ఇళయరాజా గారు స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : స్వాతిచినుకులు (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : 
గానం : బాలు, జానకి

ఓ మై లవ్ బ్యూటీ లోనా స్వీటీ నాటీ భామా
అరె ఓ మైలవ్ హాటీ వేటా భేటీ ఐతే ప్రేమా
ధిరన ధీంతరనన దింతన విరుల దొంతరల దింతన
వేయనా వెన్నెలా వంతెన
ఓ మై లవ్ బ్యూటీ లోనా స్వీటీ నాటీ భామా
అరె ఓ మైలవ్

వాలేటి పొద్దుల్లోనా వాటేయకుండునా
నీలాటి రేవుల్లోనా నీ పక్కనా 
మిన్నెటి వాగుల్లోనా ముద్దాడమందునా
తీరేటి ఎండల్లోనా నీడివ్వనా
చిలకరింతలకు కీర్తనం
పులకరింతలకు నర్తనం
కొనసాగనీ జోరుగా జోడుగా

ఓ మైలవ్ హాటీ వేటా భేటీ ఐతే ప్రేమా
అరె ఓ మైలవ్
 
వద్దన్నా పైకొస్తుంటే వయ్యరమివ్వనా
దానిమ్మ పూ బంతుల్లో నే దక్కనా
కాదన్నా కౌగిళ్ళిస్తే కాసేయకుండునా
చేమంతి పూలే గుచ్చి చెండాదన
సలపరింతలకు చందనం
కలవరింతలకు శోభనం
చెలరేగెనే వేడిగా వాడిగా

ఓ మై లవ్ బ్యూటీ లోనా స్వీటీ నాటీ భామా
అరె ఓ మైలవ్ హాటీ వేటా భేటీ ఐతే ప్రేమా
ధిరన ధీంతరనన దింతన విరుల దొంతరల దింతన
వేయనా వెన్నెలా వంతెన
ఓ మై లవ్ బ్యూటీ లోనా స్వీటీ నాటీ భామా
అరె ఓ మైలవ్


 


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail