శనివారం, ఏప్రిల్ 02, 2016

తొలివలపే తీయనిది...

కొన్ని ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉంటాయ్ ఎవరు ఎన్ని రకాలుగా అరిచి సాగదీసి రీమిక్స్ చేసినా ఒరిజినల్ పాట విన్నప్పటి ఆనందం దానికి మాత్రమే సొంతం. అలాంటి ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నీడలేని ఆడది (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

తొలి వలపే.. తొలి వలపే
తియ్యనిదీ.. తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది

తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
నీ కొరకే దాచినదీ వేరెవరూ దోచనిదీ
 
తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది

 
పొగరూ సొగసూ గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
పొగరూ.. సొగసూ.. గల చిన్నది
బిగి కౌగిలిలో ఒదిగున్నది
ఈ విసురూ ఎక్కడిదీ
నీ జతలోనే నేర్చినదీ

తొలివలపే తియ్యనిదీ 
మదిలో ఎన్నడు మాయనిది

కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కనులూ కలలూ కలబోయనీ
నీలో సగమై పెనవేయనీ
కలకాలం ఈ ప్రణయం
నిలవాలీ మనకోసం

తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిదీ

వలచే హృదయం విలువైనది
కలిసే బంధం విడిపోనిదీ 
అనురాగం కొనలేనిదీ
అది ఒకటే మన పెన్నిధీ
 
తొలివలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిదీ 




1 comments:



తొలివలపే తీయనిదీ
అలివేణీ కలల రాణి అలుకలు వలదే
కలకాలం యీ మధురిమ
నిలవాలీ మన ప్రణయము నీరజ నేత్రీ :)

జిలేబి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.