బుధవారం, ఏప్రిల్ 13, 2016

పగడాల దీవిలో...

సత్యం గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఓ మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట  ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : దొంగలకు దొంగ (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : బాలు, సుశీల

పగడాల దీవిలో.. పరువాల చిలక
తోడుగా చేరింది.. పడుచు గోరింక  
ఓయమ్మ నీ అందం.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు

ముత్యాల కోనలో.. గడుసుగోరింక
ఆశగా చూసింది.. చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు

ఎరుపేది మలిసంధ్యలో.. ఓ.. అది దాగింది నీ బుగ్గలో
వెలుగేది తొలిపొద్దులో.. ఓ.. అది తెలిసింది నీ రాకలో
ఆ..ఎన్నడు చూడనీ..అందాలన్నీ..
ఎన్నడు చూడనీ..అందాలన్నీ....
చూశాను ఈ బొమ్మలో..ఓ..హా..

ముత్యాలకోనలో.. గడుసు గోరింక
ఆశగా చూసింది చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ... నా కళ్ళకు కాళ్ళకు

నీ చిలిపి చిరునవ్వులే..ఏ.. ఊరించే నా వయసునూ
ఓ..హో..ఆ సోగ కనురెప్పలే..ఏ..కదిలించే నా కోర్కెనూ
ఆ.. నీవే నేనై తోడు నీడై.. నీవే నేనై తోడు నీడై
నిలవాలి నూరేళ్ళకు..

పగడాల దీవిలో పరువాల చిలక
తోడుగా చేరింది పడుచు గోరింక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు

ఓయమ్మ నీ అందం వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు

 

1 comments:పగడాల దీవి పరువము
రగడల జేయన్ జిలేబి రాణిగ మారెన్
మగసిరి తోడన్ రాయడు
జగముల నేల జవరాలు జావళి జేర్చెన్ :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail