శుక్రవారం, ఏప్రిల్ 08, 2016

మనసున మొలిచిన సరిగమలే...

మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు సంకీర్తనలోని ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : సంకీర్తన (1987)
సంగీతం : ఇళయరాజాసాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, జానకి

మనసున మొలిచిన సరిగమలే
ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నిన్ను చేరి
ఓ కమ్మని ఊసుని తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
ఎదసడితో నటియించగా రా
స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం

కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
కుకుకు కుకుకు కీర్తన తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిల ఎట దాగున్నావో
కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
మీ నృత్యం చూసి నిజంగా... ఊ నిజంగా..హహ..

మువ్వలరవళి పిలిచింది కవిత బదులు పలికింది
కలత నిదుర చెదిరింది మనసు కలను వెదికింది
వయ్యారాల గౌతమి ఈ ఈ ఈ ఆహాఅ..
వయ్యారాల గౌతమి ఈ కన్య రూప కల్పన
వసంతాల గీతమే నన్నే మేలుకొల్పిన
భావాల పూల రాగాలబాట నీకై వేచెనే

కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
ఇది నా మది సంకీర్తన కుకుకు కుకుకు కూ
సుధలూరే ఆలాపన కుకుకు కుకుకు కూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ

లలిత లలిత పదబంధం మదిని మృధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం అవని అధర దరహాసం
మరందాల గానమే... 
మరందాల గానమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు ఊహ వాలే నీ మ్రోల

కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ
ఏదో స్వరగతి నూతన పదగతి చూపెను నను శృతి చేసి
ఇది నా మది సంకీర్తన కుకుకు కుకుకు కూ
సుధలూరే ఆలాపన కుకుకు కుకుకు కూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ చికు చికు కూకూ

1 comments:

సరిగమలు మొలిచె మనసున
పరిపరి గలగల నడకల పరువము గానన్
సరసకు జిలేబి రమ్మా
బిరబిర దుర్ముఖి సుముఖపు బీరము తోడన్ :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.