సోమవారం, జూన్ 04, 2018

టౌను పక్కకెళ్ళొద్దురా...

టౌనుకెళ్ళి రిక్షా తొక్కైనా సరే డబ్బులు సంపాదించి జల్సాచేయాలనే మగడి ఆత్రానికి ఈ అమ్మడు కళ్ళెమెలా వేసిందో తోడికోడళ్ళు చిత్రంలోని ఈ చక్కని నృత్యరూపకంలో చూద్దామా.. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. సరిగమ వారి క్లియర్ ఆడియో ఇక్కడ వినవచ్చు. 


చిత్రం : తోడి కోడళ్ళు (1957)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం : ఘంటసాల, జిక్కి

'మూటా ముల్లె కట్టూ..'
'ఎక్కడికీ ?'
'బస్తీకి !'

తింటానికి కూడు చాలదే జాంగిరీ
ఉంటానికిల్లు చాలదే
బస్తీకి పోదాము పైసా తెద్దామే
రావే నా రంగసాని

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ
డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో
డౌనైపోతావో రబ్బీ బంగారు సామి

రెక్కలన్నీ ఇరుసుకుంట
రిక్షాలు లాక్కుంట
రెక్కలన్నీ ఇరుసుకుంట
రిక్షాలు లాక్కుంట
చిల్లరంత చేర్చుకుంట
సినీమాలు చూసుకుంట

షికార్లు కొడదామే పిల్లా
జలసా చేద్దామే
బస్తీకి పోదాము పైసా తెద్దామే
రావే నా రంగసాని

కూలి దొరకదు నాలి దొరకదు
గొంతు తడుపుకొన నీరు దొరకదు
కూలి దొరకదు నాలి దొరకదు
గొంతు తడుపుకొన నీరు దొరకదు
రేయి పగలు రిక్షా లాగిన అద్దెకుపోను
అణా మిగలదు
గడప గడపకూ కడుపు పట్టుకొని
ఆకలాకలని అంగలార్చితే
గేటు బిగించీ కొట్టొస్తారు
కుక్కలనీ ఉసిగొల్పిస్తారు

'చాల్లెహే..'

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ
డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో
డౌనైపోతావో రబ్బీ బంగారు సామి

ఫాక్టరీలలో పని సులువంట
గంటైపోతే ఇంటో ఉంటా
వారం వారం బట్వాడంట
ఒరే అరే అన వీల్లేదంట
కాఫీతోటే గడపచ్చంట
కబుర్లు చెప్పుక బతకచ్చంట

'అట్టాగా...'

చూడ చిత్రమంటా
పిల్లా చోద్యమవుతదంటా
బస్తీకి పోదాము పైసా తెద్దామే
రావే నా రంగసాని

పిప్పై పోయే పిచ్చి ఖర్చులు
పోకిరి మూకల సావాసాలు
పిప్పై పోయే పిచ్చి ఖర్చులు
పోకిరి మూకల సావాసాలు
చీట్లపేకలు..సిగ సిగ పట్లు..
తాగుడు వాగుడు తన్నులాటలు
ఆ!.. హు!...
ఇంటి చుట్టునా ఈగలు దోమలు
ఇరుకు సందులో మురుగు వాసనలు
అంటురోగములు తగిలి చచ్చినా
అవతలికీడ్చే దిక్కే ఉండదు

'అయ్యబాబోయ్ !'

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ
డాంబికాలు పోవద్దురా
టౌను పక్కకెళ్ళేవో
డౌనైపోతావో రబ్బీ బంగారు సామి

ఏలి కేస్తె నువు కాలికేస్తవు
ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏలి కేస్తె నువు కాలికేస్తవు
ఎనక్కి రమ్మని గోల చేస్తవూ
ఏదారంటే గోదారంటవు
ఇరుకున పెట్టి కొరుక్కు తింటవ్
దిక్కు తోచనీయవే పిల్లా తిక మక చేసేవే

బస్తీకి నే బోను నీతో ఉంటానే
రాణి నా రంగసానీ !

గొడ్డూ గోదా మేపుకుందాం
కోళ్ళూ మేకలు పెంచుకుందాం
కూరా నారా జరుపుకుందాం
పాలూ పెరుగు అమ్ముకుందాం
పిల్లా జెల్లను సూసుకుందాం
తలో గంజియో తాగి పడుందాం

టౌను పక్కకెళ్ళొద్దండోయ్ బాబూ
డాంబికాలు పోవద్దండోయ్
టౌను పక్కకెళ్ళేరో డౌనైపోతారూ
తానే తందన్న తాన..
తందన్న తాన.. తందన్న తానా!

 

2 comments:

చక్కని జానపద గీతం..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.