శుక్రవారం, జూన్ 01, 2018

రానంటే రానే రానోయ్...

నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించిన సావిత్రమ్మ గారి బయోపిక్ ’మహానటి’ పుణ్యమా అని యువతరంతో సహా ప్రేక్షకులంతా బ్లాక్ అండ్ వైట్ సినిమాల వైపు ఆసక్తిగా చూస్తున్న తరుణంలో, అప్పటి సినిమాల్లో ఉన్న కొన్ని నృత్య రూపకాలను ఈ నెలంతా తలచుకుందాం. ముందుగా పాతళభైరవి చిత్రంలో సావిత్రమ్మ మొదటి సారి తెరపై కనిపించిన పాట చూద్దాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పాతాళభైరవి (1950)
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : పింగళి
గానం : పిఠాపురం, ఏ.పి.కోమల

రానంటే రానే రానోయ్
ఇక రానంటే రానే రానోయ్
మన ఋణమిక యింతేనోయ్
ఇక రానంటే రానే రానోయ్


ఓ.. మనకూ మనకూ తీరని ఋణమే

ఆఆ...మనసే చెడెనిక ఎక్కడి ఋణమోయ్

చీటికి మాటికి మనసులు చెడితే..
ఏ..హే.. చీటికి మాటికి మనసులు చెడితే 
ఈ కాపురమెటులె.. దిత్తాం..దిత్తై.. 
తకిట దిత్తాం.. తకిట దిత్తై.. 
తకిట ఈ కాపురమెటులె 
ఈ కాపురమెటులె...

ఎవరికి తెలుసును పో...

తప్పంతా.. ఇక తప్పంతా..
ఈ తప్పంతా నాదేననుకో
నా మెప్పంతా.. 
నా మెప్పంతా నీదేననుకో
నా వయ్యారి భామా రావే..



2 comments:

అవునండీ..మళ్ళీ పాత సినిమాలు కొత్త తరాలని కూడా ఆకర్షిసున్నాయి నాగి పుణ్యమాని..మొన్న ఈటీవి సినిమాలో..ఈ ఆదివారనమనుకుంటా..రోజంతా సావిత్రమ్మ మూవీస్ వేస్తున్నారని చూసి చాలా హాపీ ఫీలయ్యాను..భలే పాట..

అవునా చాలా మంచి విషయం చెప్పారు శాంతి గారు. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.