గురువారం, జూన్ 21, 2018

వెన్నెలరేయి చందమామ...

వెన్నెల రాత్రి ఈ యువ జంట ఆడుకునే కబుర్లేమిటో మనమూ విందామా, రంగులరాట్నం చిత్రంలోని ఈ చక్కని పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రంగులరాట్నం (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు   
సాహిత్యం : కొసరాజు    
గానం : బి.గోపాలం, జానకి   

వెన్నెలరేయి చందమామ
వెచ్చగనున్నది మామ
మనసేదోలాగున్నది
నాకేదోలాగున్నది

తీరిచి వెన్నెల కాయువేళ
దోరవయసులో పిల్లా
నీకాలాగే వుంటది
మనసాలాగే వుంటది.

చల్లని గాలి తోడురాగా
సైగలతో నువు చూడగా
కనుసైగలతో వలవేయగా
గుండెలదరగా నీతో చాటుగా
గుసగుసలాడగ సిగ్గౌతున్నది

వెన్నెలరేయి చందమామ
వెచ్చగనున్నది మామ
మనసేదోలాగున్నది
నాకేదోలాగున్నది

నడకలతోటి వియ్యమంది
నవ్వులతో నను పిల్వగా
చిరునవ్వులతో పక్క నిల్వగా
చిన్ననాటి ఆ సిగ్గు ఎగ్గులు
చిన్నబుచ్చుకొని చిత్తైపోవటే

తీరిచి వెన్నెల కాయువేళ
దోరవయసులో పిల్లా
నీకాలాగే వుంటది
మనసాలాగే వుంటది.

తీయ తీయగా సరసమాడి
చేయి చేయి కల్పుతూ
మన చేయి చేయి కల్పుతూ
మాటలతో నువు మత్తెక్కించితే
మనసే నాతో రాలేనన్నదోయ్

వెన్నెలరేయి చందమామ
వెచ్చగనున్నది మామ
మనసేదోలాగున్నది
నాకేదోలాగున్నది


4 comments:

ఇన్నేళ్ళనించీ మౌనంగా తన ఉనికిని నిలబెట్టుకున్న చంద్రమోహన్ గారు నిజంగా గ్రేటండీ..

అవును శాంతి గారూ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

శాంతి గారన్నది నిజం. సినిమారంగంలో హీరోల పాత్రల్ని ఏలుతున్న బలమైన సామాజికవర్గాలకి చెందినవాడు కాకపోయినా కూడా హీరో గా వెలిగినవాడు చంద్రమోహన్. ఉదయకిరణ్ కూడా అలాగే కొనసాగుతాడని అభిప్రాయపడ్డారు కానీ మధ్యలోనే రాలిపోయాడు ప్చ్.

నిజమే నరసింహారావు గారు. థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.