శనివారం, జూన్ 30, 2018

అడిగిందానికి చెప్పి...

ఇల్లరికం చిత్రంలోని ఒక సరదా నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం :  ఇల్లరికం (1959)సంగీతం :  టి. చలపతిరావుగీతరచయిత :  కొసరాజునేపధ్య గానం :  ఘంటసాల, సుశీలఅడిగిందానికి చెప్పి... ఎదురాడక ప్రశ్నను విప్పినిల్చెదవా గెల్చెదవా... ఓహో చిన్నదానాఅడిగిందానికి చెబుతా... ఎంతైనా పందెం గడతానిల్చెదనోయి గెల్చెదనోయి... ఓహో...

శుక్రవారం, జూన్ 29, 2018

సెలయేటి జాలులాగా...

శాంతి నివాసం చిత్రంలోని ఒక చక్కని నృత్యరూపకాన్ని నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శాంతి నివాసం (1960)సంగీతం : ఘంటసాల సాహిత్యం : సముద్రాల జూనియర్     గానం : పి.లీల సెలయేటి జాలులాగా చిందేసే లేడిలాగాసరదాగా గాలిలోన తేలిపోదామా మనమూ సోలిపోదామా నిన్ను జూసి నింగిలోన మబ్బునౌతానే నేను మబ్బునౌతానేనిన్ను జూచి నాట్యమాడే నెమలినౌతానేనేను...

గురువారం, జూన్ 28, 2018

మధురా నగరిలో...

అభిమానం చిత్రంలో సావిత్రమ్మ అభినయించిన ఒక చక్కని నృత్య రూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అభిమానం (1960)సంగీతం : ఘంటసాల సాహిత్యం : సముద్రాల జూనియర్     గానం : సుశీల కొంగు లాగెదవేలరా కొంటె కృష్ణ కొంగు చాటున కలరులే దొంగవారు దోస మొనరించు వారిని త్రోసిపుచ్చి ఏమి నేరని వారిని ఏచ తగునే మధురా నగరిలో చల్ల నమ్మ బోదు...

బుధవారం, జూన్ 27, 2018

పరుల మేలు కోరి...

పెళ్ళికాని పిల్లలు చిత్రంలోని ఒక చక్కని నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : పెళ్ళి కాని పిల్లలు (1961) సంగీతం : మాస్టర్ వేణు సాహిత్యం : ఆరుద్ర       గానం : ఈశ్వరి, లత పరుల మేలు కోరి గరళమ్ము భుజియింప ప్రాణనాధు బాధ కానజాల సత్వరమ్ము పతికి చలువ గూర్చెడు రీతి తెల్పరేల కోటి వేల్పులార...

మంగళవారం, జూన్ 26, 2018

ఒకడు కావాలి...

మనుషులు మమతలు సినిమాలో ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మనుషులు మమతలు (1965) సంగీతం : టి.చలపతిరావు   సాహిత్యం : కొసరాజు రాఘవయ్య చౌదరి       గానం : జానకి ఒకడు కావాలి అతడు రావాలి నాకు నచ్చినవాడు నన్ను మెచ్చిన వాడు నాకు నచ్చినవాడు నన్ను మెచ్చిన వాడు ఒకడు కావాలి అందము...

సోమవారం, జూన్ 25, 2018

సతీ సావిత్రి...

సతీ సావిత్రి కథ తెలియని తెలుగువారు ఉండరేమో అనడం ఎంత నిజమో అందులో చాలా మందికి ఈ నాటకం ద్వారానే తెలిసి ఉండచ్చు అనేది కూడా అంతే నిజం. ఎన్టీఆర్ సావిత్రి నటించిన ఈ నాటకం తెలుగునాట అంతగా ఫేమస్ అయింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఉమ్మడి కుటుంబం (1967)సంగీతం : టి.వి.రాజు సాహిత్యం : సముద్రాల జూనియర్     గానం : ఘంటసాల, ఎం.ఆర్.తిలకం ఎవరీ...

ఆదివారం, జూన్ 24, 2018

శ్రీ గౌరి శ్రీ గౌరియే...

గంగమ్మ ఆ శివయ్య శిరమెక్కి నాట్యమాడినా కూడా శ్రీ గౌరి శ్రీ గౌరియే అని కీర్తించే ఈ చక్కని నృత్యరూపకం విచిత్ర దాంపత్యం చిత్రం లోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : విచిత్ర దాంపత్యం (1971) సంగీతం : అశ్వథ్ధామ    సాహిత్యం : సి.నారాయణరెడ్డి      గానం : సుశీల  శ్రీ గౌరి శ్రీ గౌరియే శివుని శిరమందు ఏ గంగ...

శనివారం, జూన్ 23, 2018

నలుగురు నవ్వేరురా...

కన్నయ్య చిలిపి అల్లర్లని వద్దని అనలేకా కావాలని నలుగురిలో అల్లరిపాలు కాలేక ఆ నల్లనయ్యకి ఈ గోపెమ్మ విన్నపాలేమిటో ఈ చక్కని నృత్యరూపకం ద్వారా మనమూ విందామా. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : విచిత్ర కుటుంబం (1969) సంగీతం : టి.వి.రాజు    సాహిత్యం : సి.నారాయణరెడ్డి     గానం : సుశీల నలుగురు నవ్వేరురా స్వామీ నలుగురు నవ్వేరురా గోపాల...

శుక్రవారం, జూన్ 22, 2018

తెలుగు జాతి మనది...

విశాలాంధ్రను అభిలషిస్తూ రూపొందించిన ఓ చక్కని నృత్యరూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : తల్లా పెళ్ళామా (1970) సంగీతం : టి.వి.రాజు     సాహిత్యం : సి.నారాయణరెడ్డి      గానం : ఘంటసాల తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు...

గురువారం, జూన్ 21, 2018

వెన్నెలరేయి చందమామ...

వెన్నెల రాత్రి ఈ యువ జంట ఆడుకునే కబుర్లేమిటో మనమూ విందామా, రంగులరాట్నం చిత్రంలోని ఈ చక్కని పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రంగులరాట్నం (1967) సంగీతం : ఎస్.రాజేశ్వరరావు    సాహిత్యం : కొసరాజు     గానం : బి.గోపాలం, జానకి    వెన్నెలరేయి చందమామ వెచ్చగనున్నది మామ మనసేదోలాగున్నది నాకేదోలాగున్నది...

బుధవారం, జూన్ 20, 2018

చిరునవ్వుల కులికేరాజా...

అమాయకురాలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అమాయకురాలు (1971) సంగీతం : ఎస్.రాజేశ్వరరావు    సాహిత్యం : కొసరాజు     గానం : సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి   చిరునవ్వుల కులికేరాజా సిగ్గంతా ఒలికే రాణి సరిజోడూ కుదిరిందిలే సరదాలకు లోటే లేదులే చిరునవ్వుల కులికేరాజా...

మంగళవారం, జూన్ 19, 2018

ఔనంటారా మీరు కాదంటారా...

లోకం పోకడలను యువతరం తీరును ఎండగట్టి, స్వతంత్ర భారతంలో ప్రజలెలా మెలగాలో తెలియజేసే ఈ చక్కని నృత్యరూపకం మాంగళ్యబలం చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మాంగళ్యబలం (1959)సంగీతం : మాస్టర్ వేణు   సాహిత్యం : కొసరాజు    గానం : పి.లీల, సుశీల ఔనంటారా మీరు కాదంటారా ఔనంటారా మీరు కాదంటారా ఏమంటారు వట్టి వాదంటారాపేరుకు మాత్రం మీరు పెద్దమనుషులంటారు...

సోమవారం, జూన్ 18, 2018

భారతవీరా ఓ భారతవీరా...

భారత యువతకు చక్కని సందేశమిచ్చే ఈ నృత్యరూపకం భలే రాముడు చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : భలేరాముడు (1956)సంగీతం : ఎస్.రాజేశ్వరరావు   సాహిత్యం : సదాశివ బ్రహ్మం   గానం : పి.లీల, బృందం భారతవీరా ఓ భారతవీరా భారతవీరా ఓ భారతవీరా లేరా మేల్కొనవేరా సోదరా భారతదేశం నీదేరాభారతదేశం నీదేరా ఈ భారతదేశం నీదేరాఓ భారతవీరా ఓ భారతవీరా ఓ భారతవీరా...

ఆదివారం, జూన్ 17, 2018

మొక్కజొన్న తోటలో...

మనసైన బంగరి మావను వద్దకు రారమ్మని కబురు పెడుతూ వాడికి ఈ చిన్నది ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో మనమూ విందామా. అదృష్టవంతులు చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అదృష్టవంతులు (1969) సంగీతం : కె.వి.మహదేవన్   సాహిత్యం : కొనకళ్ళ వెంకటరత్నం   గానం : సుశీల మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో మరువకు మామయ్యా నువ్వు...

శనివారం, జూన్ 16, 2018

ఉషాపరిణయం(యక్షగానం)...

మల్లీశ్వరి చిత్రంలోని ఉషాపరిణయం యక్ష గానాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మల్లీశ్వరి (1951)సంగీతం : ఎస్.రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు సాహిత్యం : దేవులపల్లి గానం : కమలాదేవి, భానుమతి, బృందంశ్రీ సతితో సరసీజనయనువలె చెలువున దేవేరితో.. ఆఆఆఅ.. శ్రీ సతితో సరసీజనయనువలె చెలువున దేవేరితో కొలువునచెలువున దేవేరితో.... చెలువున దేవేరితో వెలయగ...

శుక్రవారం, జూన్ 15, 2018

నీకో తోడు కావాలి...

చదువు, సంస్కారం, గుణగణాలే ఎన్నటికీ చెదరని ఆస్తులని చాటి చెప్పే ఓ సరదా ఐన నృత్య రూపకాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)సంగీతం : ఎస్.రాజేశ్వరరావు సాహిత్యం : ఆరుద్ర  గానం : ఘంటసాల, సుశీలనీకో తోడు కావాలి నాకో నీడ కావాలి ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని నన్నే నీదాన్ని చేసుకోవాలి నీకో తోడు కావాలి నాకో నీడ...

గురువారం, జూన్ 14, 2018

ముందటి వలె నాపై...

ఈ అందమైన క్షేత్రయ్య పదాన్ని ఆత్మగౌరవం చిత్రంలో ఎంత అందంగా అభినయించారో చూద్దామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఆత్మగౌరవం (1966) సంగీతం : ఎస్.రాజేశ్వరరావు  సాహిత్యం : క్షేత్రయ్య పదం   గానం : సుశీల ముందటి వలె నాపై నెనరున్నదా సామి ముచ్చటలిక నేలరా నా సామి ముచ్చటలికనేలరా ఎందుకు మొగమిచ్చకపు మాటలాడేవు ఎందుకు మొగమిచ్చకపు మాటలాడేవు...

బుధవారం, జూన్ 13, 2018

ఓ ఉంగరాల ముంగురుల...

తనపై అలిగిన ప్రేయసి అలక పోగొట్టడానికి మాటల గారడితో అతనెలా బుజ్జగించాడో చెప్పే ఈ హుషారైన నృత్య రూపకం డాక్టర్ చక్రవర్తి చిత్రంలోనిది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964) సంగీతం : ఎస్.రాజేశ్వరరావు సాహిత్యం : దాశరధి  గానం : మాధవపెద్ది, సుశీల, కోరస్ ఓహోహోహో.. హోయ్... ఆహాహాహాహా...ఆఆఅ... హాయ్ ఓహోహోహోహో.. హాయ్..  ఆహి...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.