గురువారం, ఫిబ్రవరి 06, 2014

ఏదో తెలియని బంధమిది

ఒకప్పటి గీత రచయితలు డబ్బింగ్ పాటలలో కూడా అందమైన తెలుగు పదాలు ఉపయోగించి అద్భుతంగా రాసేవారు, ఇళయరాజా, మణిరత్నం అలా రాయించుకునే వారు కానీ ఈ మధ్య పాటలలో లిప్ సింక్ అండ్ ట్యూన్ పై తప్ప తెలుగు మాటల గురించి పెద్దగా ఆలోచిస్తున్నట్లుగా కనిపించట్లేదు. నాయకుడు లోని ఈ పాట చూడండి, విన్నవాళ్ళెవరికైనా ఇది ఒక డబ్బింగ్ గీతమని అనిపించనే అనిపించదు. ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన మరో మేలిముత్యం ఇది, మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం: నాయకుడు (1987)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి / రాజశ్రీ ?
గానం: బాలు, శైలజ

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది

పూజకు నోచని పువ్వును కోరి
వలచిన స్వామివి నువ్వేలే...
రూపం లేని అనురాగానికి
ఊపిరి నీ చిరు నవ్వేలే...
కోవెల లేనీ....
కోవెల లేని దేవుడవు...
గుండెల గుడిలో వెలిశావు...ఊ..
పలికే జీవన సంగీతానికి
వలపుల స్వరమై ఒదిగావు...
తనువూ మనసూ ఇక నీవే...

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది

వేసవి దారుల వేసటలోన
వెన్నెల తోడై కలిశావు...
పూచే మల్లెల తీగకు నేడు
పందిరి నీవై నిలిచావు...
ఆశలు రాలే...ఏ..ఏ
ఆశలు రాలే శిశిరంలో...ఓ..
ఆమని నీవై వెలిశావు...ఊ..
ఆలుమగల అద్వైతానికి
అర్థం నీవై నిలిచావు...
తనువూ మనసూ ఇక నీవే...ఏ..ఏ

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది..ఈ..ఈ..
ఏదో తెలియని బంధమిది హా..ఆ..

2 comments:

శరణ్య లుక్స్ కి ఇంతకంటే సూటబుల్ కారెక్టర్ మరోటి వుండదేమో..మంచి పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.