శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014

తీగనై మల్లెలూ పూచినా వేళ..

కాస్త విషాద ఛాయలు కనిపించినా కూడా ఇళయరాజాగారు కంపోజ్ చేసిన ఈ అందమైన మెలోడీ నాకు చాలా ఇష్టమైన ప్రేమ గీతాలలో ఒకటి. మీరూ ఆస్వాదించండి ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.చిత్రం : ఆరాధన (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల

తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేదా
ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరిచేదా

కలలో మెదిలిందా ఇది కథలో చదివిందా
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా
మారమంటే మారుతుందా మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా చేయి చేయి కలిసేనా

తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల

5 comments:

ఈ మూవీలో "అరె ఏమైందీ.." కన్నా ఈ పాట నాకు చాలా ఇష్టమండీ..

అచ్చుతప్పులు లేకుండా ఎంత చక్కగా రాస్తున్నారు వేణూ...

Chala ishtamaina pata Chala rojula taruvata chusanu ..thanks venu garu :-)Radhika (nani)

హార్ట్ టచింగ్ సాంగ్..ఈ పాటకి మీరు వేసిన పిక్ చాలా యాప్ట్ గా వుంది వేణూజీ..చాలా, చాలా బాగుంది..

థాంక్స్ తృష్ణ గారు, నాక్కూడా ఫస్ట్ ఛాయిస్ ఇదేనండి :-)

థాంక్స్ జ్యోతిర్మయి గారు, సాధ్యమైనంత వరకూ తప్పులు లేకుండా చూడ్డానికి ప్రయత్నిస్తున్నానండీ.. అప్పటికీ అపుడపుడు వస్తూనే ఉన్నాయి :-)

థాంక్స్ రాధిక గారు :-)

థాంక్స్ శాంతి గారు పిక్ నచ్చినందుకు సంతోషం :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail