మంగళవారం, ఫిబ్రవరి 25, 2014

సంగీతం మధుర సంగీతం..

ఈ సినిమా గురించి మంచి మాటలు చాలా సార్లు విన్నాను కానీ పూర్తిగా చూసే ఆవకాశం ఎపుడూ దొరకలేదు. "కృష్ణవేణి తెలుగింటి విరిబోణి" పాటతో పాటు ఈ సినిమాలో నాకు ఇష్టమైన మరో పాట "ఈ సంగీతం మధుర సంగీతం" పాట, ఈ సంగీత దర్శకుడు విజయభాస్కర్ గారు చేసినవే తక్కువ సినిమాలో లేక హిట్ అయినవి కొన్నో తెలియవు కానీ సంగీత దర్శకునిగా చాలా అరుదుగా వినిపించే పేరు కానీ ఉన్నవాటిలో మంచి పాటలు ఉన్నాయి. ఈ చక్కని పాటను మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే చిమటాలో ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.చిత్రం : కృష్ణవేణి (1974) 
సంగీతం : విజయభాస్కర్
సాహిత్యం : ఆరుద్ర 
గానం : పి.సుశీల 

సంగీతం మధుర సంగీతం
సంగీతం మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం


ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం 
లలలా లలలా లలలలా... లలలా లలలా లలలలా
ఆహహహా.. ఆహహహా.. మ్.హుహుహుహూ..
ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం
మదిలో మమతలే మంజుల రవళిగ మ్రోగును మోహనరాగం
సంగీతం మధుర సంగీతం
బాలపాపల ఆటల పాటలె అమ్మకు కమ్మని గీతం
ఆకాశవీధుల సాగే గువ్వలు తెచ్చే ప్రేమ సందేశం

సంగీతం మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం


ఎన్నోనోముల పంటలుపండి ముచ్చట గొలుపు సంతానం
లలలా లలలా లలలలా.. లలలా లలలా లలలలా
ఆహహహా.. ఆహహహా.. మ్.హుహుహుహూ..
ఎన్నోనోముల పంటలుపండి ముచ్చట గొలుపు సంతానం
ఆశాఫలముల రాశులు ఎదలో చేసెను రాగ సంచారం
సంగీతం మధుర సంగీతం
శోభన జీవన దీపావళిలో పెరిగెను పావనతేజం
తనివే తీరా తనయుల చేర తల్లికి తరగని భాగ్యం

సంగీతం మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం

2 comments:

అమ్మ ప్రేమని తెలియ చెసే మధురమైన పాటల్లో మరో మనసుని టచ్ చేసే పాట వేణూజీ....

అవునండీ అందుకే ఈ పాట నాకూ నచ్చుతుంది. థాంక్స్ శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail