ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

సుందరి నీవూ.. సుందరుడేనూ..

ఇళయరాజా స్వర పరచిన మరో అందమైన మెలోడి ఇది. మైఖేల్ మదన కామరాజు సినిమా కామెడీ ప్రధానమే అయినా పాటలు కూడా బాగుంటాయ్... మెలోడియస్ గా సాగే ఈ పాట చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది మీరూ ఆస్వాదించండి. ఎంబెడెడ్ వీడియో టైటిల్ చూసి గాభరా పడకండి అది తెలుగు ఆడియో ఉన్న వీడియోనే. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : మైఖెల్ మదన కామ రాజు (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ   
గానం : బాలు, చిత్ర

సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించె చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం

మాటలకందని రూపం వర్ణించలేనీ కావ్యం
పూచిన నీలో అందం నాకది మంగళ బంధం
నీ నవ్వులన్నీ చంద్రోదయాలే
నీ చూపులన్నీ అరుణోదయాలే..ఆ..ఆ..

సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించె చూడు ఆనందరాగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం

ఆమని పండుగ చేసె స్వప్నాల లోకము విరిసె
ప్రేమ సరాగము పిలిచె స్వర్గం ఎదురుగా నిలిచె
ఈ అనురాగం మన్మథ యాగం
భువిని వెలిసే మనకొక లోకం..ఆ..ఆ..

సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం
చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించె చూడు ఆనందరాగం
సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం
సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం

5 comments:

Enno manchi adbuthamaina patalni mee tapaala dvara parichayam chestunnaaru..chaalaa thanq venu garoo:-)

Yeah, this is absolutely a beautiful song ! This song also reminds another melody "sundari neeve nenanta" from "Dalapathy"

$iddharth

థాంక్స్ కార్తీక్ జీ..
థాంక్స్ సిద్దార్థ్ గారు.. "సుందరీ నీవే నేనంటా" తోనూ గీతాంజలిలో "ఓ ప్రియా ప్రియా" తోనూ నాకు ఒకే ప్రాబ్లమ్ అండీ, మెలోడియస్ పాట మధ్యలో హోరుమని యుద్దాల మ్యూజిక్ మొత్తం ఫీల్ ని డిస్ట్రబ్ చేసేస్తుంది. అందుకే ఎక్కువ వినలేను.

ఇలాంటి సాంగ్స్ చూసినపుడు, మన ట్రెడిషన్స్ లోని అందం సున్నితం గా మనసుని హత్తుకుంటుంది.

కరెక్ట్ శాంతి గారు, థాంక్స్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.