శనివారం, ఫిబ్రవరి 01, 2014

ప్రియా నిను చూడలేక

ప్రేమకథా చిత్రాలలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి సూపర్ హిట్ అయిన సినిమా "ప్రేమలేఖ" లోని ఈ పాట డబ్బింగ్ పాటైనప్పటికీ చక్కని పాటగా గుర్తుండిపోతుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే చిమటాలో ఇక్కడ ఆన్ లైన్ లో లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని వినండి.



చిత్రం : ప్రేమలేఖ (1996)
సంగీతం : దేవ
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, అనురాధాశ్రీరామ్

ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక
నీ తలుపుతోనే నే బ్రతుకుతున్నా . . .
నీ తలపుతోనే నే బతుకుతున్నా..
ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక...

వీచేటి గాలులను నేనడిగాను నీకుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీకుశలం
అనుక్షణం నామనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలలో నీకధలే
కనులకు నిదురలే కరువాయె

ప్రియా నిను చూడలేక 
ఊహలో నీరూపు రాక

కోవెలలో కోరితినీ నీదరికీ నను చేర్చమని
దేవుడినే వేడితినీ కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దయినా అందించరాదా
నినుగాక నీ కలనీ పెదవంటుకోదా
వలపులు నీదరి చేరుటెలా
ఊహల పడవలే చేర్చునులే

ప్రియా నిను చూడలేక 
ఊహలో నీరూపురాక
హాఅ... నీ తలుపుతోనె బతుకుతున్నా . . . 
నీ తలపుతోనే నే బతుకుతున్నా..
ప్రియా నిను చూడలేక ఊహలో నీరూపురాక...

3 comments:

నైస్ సాంగ్ వెణూజీ..ఇందులో యెరుపు లోలాకు మెరిసెను..మెరిసెను పాట కూడా బావుంటుంది..

మరిచాను..చిన్నదానా పాటైతే టూ గుడ్..

థాంక్స్ శాంతి గారు.. ఈ సినిమాలో దదాపు అన్ని పాటలు బాగుంటాయండీ.. ఈ పాట తర్వాత నాకు చిన్నదానా ఎక్కువ ఇష్టం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.