శనివారం, ఏప్రిల్ 03, 2021

ఎంత ఎంత చూసిన...

ఇళయరాజా గారు సంగీతం అందించిన కొత్త సినిమా "గమనం" లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గమనం (2021)
సంగీతం : ఇళయరాజా   
సాహిత్యం : కృష్ణకాంత్
గానం : జితిన్ రాజ్, విభావరి

ఎంత ఎంత చూసిన 
చాలదే ఈ మనసున 
ఓ మేరె జాన్
ఎంత ఎంత వేచిన 
రాకతోనే తీరెనా 
ఈ వేదన

మాటల్లో కూడా తెలుపలేవా
పరదాలు తీసి తెగించలేను
కహూఁ మై క్యా - హై ప్యార్ మే 
జో మేరా హాల్ 

ఎంత ఎంత చూసిన 
చాలదే ఈ మనసున 
ఓ మేరె జాన్

తాను కాస్త ముందుకొస్తె 
ఆగిపోయే ఊపిరి
కానరాని వేళలోన ఉండలేదులే
ఓరకంట చూడగానే 
మేలుకోవ ఊహలే
పెదవి దాటి రానే రావు 
మనసు మాటలే

ముందులేని అల్లరేదో 
కమ్ముకున్న వైఖరి
ఒంటరన్న మాటకింక ఆఖరే కదా
ఎక్కడున్నా ఒక్కసారి 
పెరిగిపోవు అలజడి
దోర నవ్వు సోకగానే కలత తీరదా

కహూఁ మై క్యా - హై ప్యార్ మే 
జో మేరా హాల్

ఎంత ఎంత చూసిన 
చాలదే ఈ మనసున 
ఓ మేరె జాన్

ఇన్నినాళ్ళు గుండెలోన 
జాడలేని హాయిది
నీడ కూడ రంగు మారే 
ప్రాయమే ఇది

దేనినైనా దాటిపోయే 
వేగమేమో వయసుది
తరుముతున్న ఆపలేని 
అదుపు లేనిది

రెప్పపాటు కాలమైన 
ఆగలేని జోరిది
చూడగానే నేల మీద తేలిపోయెనా
నువ్వు వేరు నేను వేరు 
అసలు కాని చోటిది
ఇద్ధరింక ఒకటిగానే కలిసెతనమిది
డుబా దియా బురీ తరహ్ 
యే కైసా ప్యార్

ఎంత ఎంత చూసిన 
చాలదే ఈ మనసున 
ఓ మేరె జాన్
ఎంత ఎంత వేచిన 
రాకతోనే తీరెనా 
ఈ వేదన

మాటల్లో కూడా తెలుపలేను
పరదాలు తీసి తెగించలేను
కహూఁ మై క్యా - హై ప్యార్ మే 
జో మేరా హాల్!!!

ఎంత ఎంత చూసిన 
చాలదే ఈ మనసున 
ఓ మేరె జాన్
  

2 comments:

"కలయా... నిజమా" అన్న కూలీ నెంబర్ వన్ పాట ఎందుకనో వద్దన్నా గుర్తొస్తుంది.

అవునండీ.. అక్కడక్కడ ఆర్కెస్ట్రేషన్ "చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం(స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్)" పాట కూడా గుర్తొస్తుంది. సూతింగ్ గా ఐతే ఉంది కానీ కొత్తగా మాత్రం లేదు. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ భవానీ ప్రసాద్ గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.