ఆదివారం, అక్టోబర్ 04, 2015

తొలి చూపు తోరణమాయే..

రమేష్ నాయుడు గారి స్వరకల్పనలో వేటూరి గారు రాసిన ఒక అందమైన ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. జంధ్యాల గారు తెలుగింటి పెళ్ళి వేడుకను చాలా ముచ్చటగా చిత్రీకరించారీ పాటలో. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మల్లె పందిరి (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే..

తొలి చూపుతో 'రణ'మాయే ..
మ్.మ్.మ్మ్ రాముని తోక ..
సారీ నాకు అచ్చ తెలుగు అంతగా రాదు.. అంటే..
అంటే మిగతా భాషలలో పండితుడని కాదనుకొండి ...

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే

పగడాల పెదవులతోనే బిడియాలు కలబడుతుంటే
వగలమారి చెక్కిలి మీద పగటి చుక్క పకపకమంటే
శివమై అనుభవమై.. శుభమై సుందరమై
శివమై అనుభవమై.. శుభమై సుందరమై
కనుచూపు శుభలేఖలుగా
కనుచూపు శుభలేఖలుగా
కళ్యాణ రేఖలు మెరిసే...

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే

మనము పసుపు కుంకుమలై
మనువు గడప దాటుతువుంటే
కలిసి బొట్టు కాటుకలై కాపురాన అడుగిడుతుంటే
సిరిగా శ్రీహరిగా.. కలిసే లాహిరిలో...
సిరిగా శ్రీహరిగా.. కలిసే లా..హిరిలో...
నయనాలు ప్రియవచనాలై
నయనాలు ప్రియవచనాలై
అనురాగమే వినిపించే..

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే
సన్నజాజి తీవెలలోనే
సన్నాయి వీణలు పలికే

తొలి చూపు తోరణమాయే
కళ్యాణ కారణమాయే..

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.