మంగళవారం, అక్టోబర్ 20, 2015

ఓంకార పంజర శుకీం..

ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవి అలంకరణలో అర్చించుకుంటూ కనకదుర్గ పూజా మహిమ లోని ఈ చక్కని పాట తలచుకుందామా. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కనకదుర్గ పూజా మహిమ (1960)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : ??
గానం : మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్

ఓంకార పంజర శుకీం
ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం
ఆర్యాం అంతర్విభావయే
గౌరీం... గౌరీం... గౌరీం


జయజయ నమో కనకదుర్గా!
నమో మోక్షమార్గా! శ్రితానీక దక్షా! నిరాగా!
ఘోర దుర్వార దౌర్భగ్య భంగా!
అనంగా విభంగా! మహాచండ శృంగత్తురంగా!
గౌరీ! సదా భక్త క్షేమంకరీ!

జయకరీ! శంకరీ! శ్రీకర వశంకరీ!
వసుధాశుభంకరీ! ఆర్తజన అభయంకరీ!
ఆర్తజన అభయంకరీ!
పాహీ త్రిలోకైక జననీ! భవానీ!
భక్త చింతామణీ! ముక్తి సందాయినీ!
ఆర్త సంచారిణీ! ధూర్త సంహారిణీ!
కాళీ! కల్యాణి! గీర్వాణి! హ్రీంకారిణీ!
అన్నపూర్ణా! అపర్ణాంబ! కాత్యాయనీ!
శ్రీచక్ర సింహాసినీ! శాంభవీ! శాంభవీ!
భ్రమరాంబ! శ్యామలా! యవ్వనీ!
ధగల జ్వాలాముఖీ!
కామాక్షి! మీనాక్షి! ద్రాక్షాయణీ!...

పేరులే వేరుగా! అందరూ నీవెగా!
యీదీను కావగా, రావేల వేగా!
అమ్మ, నీ పాదపద్మాలు నమ్మ,
వెతలు తీరునమ్మా! నుతులు చేయగా,
కొంగు బంగారమమ్మా!...
నా జన్మ కారకులు నీ పూజలను మాని
అపరాధములు చేసిరమ్మా!
పాపులూ, పుణ్యులూ నీ పాపలే గాన,
యీ కోపమింకేలనమ్మా?! కృపజూపవమ్మా!
మనోవాంఛితార్ధమ్మునిమ్మా!
మొరాలించవమ్మా!
పాలించవమ్మా! కనికరించమ్మా!
కనికరించమ్మా! కనకదుర్గమ్మా


2 comments:

ఈ ట్యూన్ యెంత పవర్ఫుల్ గా ఉంటుందంటే, ఈ పాట విన్నప్పుడల్లా హై పవర్ వోల్టేజ్ తగిలినట్టుగా ఆనందం తో ఒళ్ళు జలదరిస్తుంది..గుండె ఢక్కాలా కొట్టుకుంటుంది..

అవునండీ బాగా చెప్పారు చాలా పవర్ ఫుల్ ట్యూన్ ఇది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail