గురువారం, అక్టోబర్ 15, 2015

శివ మనోరంజని...

అమ్మవారిని గాయత్రి మాత అలంకరణలో అర్చించుకుంటూ పేదరాశి పెద్దమ్మ చిత్రంకోసం బాలమురళి గారు గానం చేసిన ఈ పాట తలచుకుందామా. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పేదరాశి పెద్దమ్మ కథ (1968)
సంగీతం : ఎస్పీ కోదండపాణి
సాహిత్యం : చిల్లర భావనారాయణరావు
గానం : బాలమురళీ కృష్ణ గారు

శివ మనోరంజని
వరపాణీ సర్వరాణీ
కనవే జననీ కృప బూనీ
ఆఆఆఆఆ....
శివ మనోరంజని
వరపాణీ సర్వరాణీ
కనవే జననీ కృప బూనీ

కవికే కనరాని కాంతివి నీవై
కవికే కనరాని కాంతివి నీవై

శ్రుతిలో లయగా సాగే సతివై
శ్రుతిలో లయగా సాగే సతివై
అభినయ శిల్పాల అలరే కళవై
అభినయ శిల్పాల అలరే కళవై
సరస రసిక జన హృదయ కమలముల
వెలుగు కిరణముగ తళుకులొలికితివి

శివ మనోరంజని 

మెరసే జలదాల మేదుర నాదం
మెరసే జలదాల మేదుర నాదం
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా
మెరసే జలదాల మేదుర నాదం
రథమయ్యెను రారమ్మా అమ్మా అమ్మా

సలలిత గాంధర్వ వరగానమునా
సలలిత గాంధర్వ వరగానమునా

రజితగిరి శిఖరి చలన
చరణ ఝణ ఝణిత ప్రణవ
నటనముల సలుపుమిట

శివ మనోరంజని
శివ మనోరంజని
శివ మనోరంజని


3 comments:

చాలా అద్భుతమైన పాట..గాయత్రీ అమ్మవారిని కనుల ముందు సాక్షాత్కరింప చేశారు బాలమురలీకృష్ణ గారు ఈ పాటలో..

అవును శాంతి గారూ బాలమురళి గారి గాత్రం అద్భుతం.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

ఎలాంటి వార్తలు ఐన చెప్పటనికి మీ Spice Andhra online తెలుగు న్యూస్ పొర్టల్ ఎప్పటికప్పుడు వస్తున రాజకియ వార్తలు, సినీమ వార్తలు అదించటంలొ ముందు వుటొంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail