సోమవారం, అక్టోబర్ 12, 2015

కదిలే కోరికవో..

నాకు రేడియో పరిచయం చేసిన మంచి పాటలలో ఇదీ ఒకటి.. జంధ్యాల గారి మల్లెపందిరి చిత్రంలోని ఈ హుషారైన ప్రేమగీతాన్ని మీరూ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : మల్లె పందిరి (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

హే హే హే హే హే హా హా హా హా హా

కదిలే కోరికవో.. హా
కథలో నాయికవో.. అహా
కవితా కన్యకవో.. ఆహా
భువిలో తారకవో.. ఆహా
ఓ ప్రియా.. ఓ ప్రియా.. నీకిదే స్వాగతం

ల ల లల.. హ హ హ

వలచే గోపికని.. హా
కొలిచే రాధికని.. ఒహో
మనసే కానుకని.. ఆహా
మురిసే బాలికని.. ఓహో
ఓ ప్రియా.. ఓ ప్రియా.. నీకిదే స్వాగతం

జాజిమల్లి వానజల్లులోనా..
జలకాలాడే జాణ సింగారాలే 
నావిగా ... లా ల లా
సందె గాలి తావి చిందులోనా..
అందాలన్ని ముద్దమందారాలై 
నావిగా ... హా హా హా
ఏ వంక లేని వంక జాబిల్లి
నా వంక రావే నడిచే రంగవల్లి
అందుకో కమ్మని ఆమని ప్రేమని
 
 
కదిలే కోరికవో.. హా
కథలో నాయికవో.. అహా
కవితా కన్యకవో.. ఆహా
భువిలో తారకవో.. ఆహా
ఓ ప్రియా.. ఓ ప్రియా.. నీకిదే స్వాగతం

కోనసీమ పచ్చ కోక గట్టి..
గోదారమ్మ పొంగే కొంగు చుట్టి..
లీలగా ...
హా హా హా
కోయిలమ్మ ఇంటి కున్నలమ్మ
గొంతు దాటి కొత్త పాట పాడి
తియ్యగా ...
లా ల లా
నీవంకే వాలే నింక రాచిలక
చిలకమ్మ కోరే గూడె గోరింక

పంచుకో గూడుని గువ్వని గుండెని..
 
వలచే గోపికని.. హా
కొలిచే రాధికని.. ఒహో
మనసే కానుకని.. ఏహా
మురిసే బాలికని.. ఓహో
ఓ ప్రియా.. ఆహాహా.. ఓ ప్రియా.. ఆహహా..
నీకిదే.. లలలా..స్వాగతం
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.