గురువారం, అక్టోబర్ 29, 2015

ఎవ్వరె నువ్వు నను కదిపావు..

యువన్ శంకర్ రాజా స్వరపరచిన ఓ హుషారైన ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రాజూభాయ్ (2007)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హరీష్ రాఘవేంద్ర

ఎవ్వరె నువ్వు నను కదిపావు
నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా
నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లేలెమ్మంటూ
వెలుగేదో చూపావు
నాకు ఓ మనసుందంటూ
తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిశావు
మైమరపే ఇచ్చావు
నీలోనె కలిపావు

ఎవ్వరె నువ్వు నను కదిపావు
నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా
నా ప్రాణం నువ్వైపోయావు

ఎటు చూసినా ఏం చేసినా
ఏ దారిలో అడుగేసినా
నలువైపులా నాకెదురే ఉందా
మైనా...మైనా
ఏ మబ్బులో తూగాడినా
ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనందం ఉందా
నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ ఎదకైనా
ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకున్నా కాదనుకున్నా
అనుకోనిదే జరిగిందిగా
నా తీరు తెన్ను మారుతోందిగా...

ఎవ్వరె నువ్వు నను కదిపావు
నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా
నా ప్రాణం నువ్వైపోయావు

దేవత...దేవత దేవత దేవతా
అది నా దేవత
దేవత...దేవత దేవత దేవతా

చెలి చూపులో చిరు గాయమై
మలి చూపులో మటుమాయమై
తొలొప్రేమగా నే మొదలౌతున్నా
కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై
నా నిన్నలన్ని శూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా
ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను
చాలా దూరం నడిచాను
తియ్యని దిగులై పడివున్నాను
చెలి లేనిదే బతికేదెలా
ఏ ఊపిరైన...ఉత్తి గాలిలే...

ఎవ్వరె నువ్వు నను కదిపావు
నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా
నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లేలెమ్మంటూ
వెలుగేదో చూపావు
నాకు ఓ మనసుందంటూ
తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిశావు
మైమరపే ఇచ్చావు
నీలోనె కలిపావు


2 comments:

ఈ మూవీ తెలీదు కానీ పాట భలే ఉందండీ..ముఖ్యం గా లిరిక్స్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.