బుధవారం, అక్టోబర్ 28, 2015

ఎంతవరకు ఎందుకొరకు..

గమ్యం చిత్రంలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గమ్యం (2008)
సంగీతం : ఇ.ఎస్.మూర్తి, అనీల్.ఆర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రంజిత్

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శతృవులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ

తారరరరే తారరరరే తారరరరే తారారరే
తారరరరే తారరరరే తారరేరా రారరరరే
తారరరరే తారరరరే తారరేరా రారరరరే


2 comments:

ఈ మూవీ ఒక అద్భుతం..ఆ సారాన్నంతా ఒక్క పాటలో చెప్పిన సిరివెన్నెలగారు మహాద్భుతం..హేత్సాఫ్ టు ద టీం..

అవును శాంతి గారు క్రిష్, సిరివెన్నెల గారు ఇద్దరు అద్భుతం.. థాంక్స్ ఫర్ ద కామెంట్ :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail