శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి...

ఆసక్తికరమైన కథా కథనాలతో తొంబైలో వచ్చిన ఒక మంచి సినిమా ఆత్మబంధం. కలకాలంతోడుంటాడని ప్రాణంగా ప్రేమించి పెళ్ళిచేసుకున్న తన భర్త ఒక యాక్సిడెంట్ లో తనని వీడివెళ్ళిపోయాడనే దిగులుతో ఉన్న ఆమెకి అతను ఆత్మరూపంలో తనచుట్టూనే ఉండి కాపాడుకుంటున్నాడని తెలిసిన క్షణంలో నమ్మలేని ఆ నిజాన్ని ఒట్టి ఊహకాదని ఒట్టేసి చెప్పవా అంటూ భర్తనే అడిగే సంధర్బంలోని ఈ పాట చాలా అందంగా ఉంటుంది. మీరూ ఆస్వాదించండి. యూట్యూబ్ పనిచేయని వారు ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం...

గురువారం, ఫిబ్రవరి 27, 2014

కానరార కైలాస నివాస/గంగావతరణం

కైలాసానికేగి ఈశ్వరదర్శనాన్ని కోరుతూ రావణ బ్రహ్మ పాడిన ఈ పాట చాలా ప్రసన్నంగా బాగుంటుంది. ఇంతగా వేడుకున్ననూ శివుడు ప్రత్యక్షం కాకపోగా కావలి ఉన్న నంది హేళనగా నవ్వేసరికి కోపమోచ్చిన రావణాసురుడు కైలాసగిరినే పెకలించి తీసుకువెళ్ళే ప్రయత్నంలో పాడే శివతాండవ స్తోత్రం వీడియో ఇక్కడ చూడవచ్చు. రావణబ్రహ్మగా ఎన్టీఆర్ మొదట ఎంత ప్రసన్నంగా కనిపిస్తారో తరువాత అంత రౌద్రాన్నీ అవలీలగా పోషించారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు.  మిత్రులందరికీ...

బుధవారం, ఫిబ్రవరి 26, 2014

అందెను నేడే అందని జాబిల్లి

తోడు అనేది అందని జాబిలిగా ఎంచి ఎదురు చూస్తున్న ఆమె దిగులును పటాపంచలు చేస్తూ తను కోరిన చెలుడు తన చెంతకు చేరాడట. ఆ ఆనందంలో ఇన్నేళ్ళకు వసంతములు విరిశాయిట, మల్లెలూ నవ్వాయిట ఇంకా ఆతని స్పర్శ తనలో గిలిగింతల పులకింతలు రేపాయిట. తనతోడు తనకి దొరికిందని ఇకపై కన్నీటి ముత్యాలు రాలవు, తోటలో పూవులూ వాడవు అంటూ నమ్మకంగా ఈమె చెప్తున్న ప్రేమ కబురు దాశరధి గారి మాటలలో విందామా. సాలూరు వారి సరళమైన సంగీతం ఈ పాటని కలకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది. చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది,...

మంగళవారం, ఫిబ్రవరి 25, 2014

సంగీతం మధుర సంగీతం..

ఈ సినిమా గురించి మంచి మాటలు చాలా సార్లు విన్నాను కానీ పూర్తిగా చూసే ఆవకాశం ఎపుడూ దొరకలేదు. "కృష్ణవేణి తెలుగింటి విరిబోణి" పాటతో పాటు ఈ సినిమాలో నాకు ఇష్టమైన మరో పాట "ఈ సంగీతం మధుర సంగీతం" పాట, ఈ సంగీత దర్శకుడు విజయభాస్కర్ గారు చేసినవే తక్కువ సినిమాలో లేక హిట్ అయినవి కొన్నో తెలియవు కానీ సంగీత దర్శకునిగా చాలా అరుదుగా వినిపించే పేరు కానీ ఉన్నవాటిలో మంచి పాటలు ఉన్నాయి. ఈ చక్కని పాటను మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే చిమటాలో ఇక్కడ వినండి...

సోమవారం, ఫిబ్రవరి 24, 2014

తుమ్మెదా ఓ తుమ్మెదా

నాకు నచ్చిన మరో మాంచి కన్నయ్య పాట, ఊహూ కన్నయ్య పాట అనే కాదులెండి మాంచి రొమాంటిక్ పాట కూడా అనుకోవచ్చేమో డాన్సులు కాస్త పక్కన పెట్టేస్తే సిరివెన్నెల గారి సాహిత్యం మహదేవన్ గారి సంగీతాలను చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు. ఇక పాటలో అచ్చతెలుగు పరికిణీలలో గౌతమి, భానుప్రియల గురించి చెప్పనే అక్కర్లేదనుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : శ్రీనివాస కల్యాణం(1987)  సంగీతం : కె.వి.మహదేవన్సాహిత్యం :...

ఆదివారం, ఫిబ్రవరి 23, 2014

కలనైనా క్షణమైనా...

ఈ పాటలో బాలు గొంతు ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం. తను ఎన్టీఆర్ ఏఏన్నార్ లాంటి పెద్ద హీరోలకి కాకుండా చంద్రమోహన్ లాంటి వారికి పాడేటప్పుడు స్వచ్చంగా స్వేచ్చగా పాడతారనిపిస్తుంటుంది నాకు బహుశా అందుకేనేమో ఈ పాటలలో మరింత బాగుంటుంది. ఇక సినారే గారి పదాల ఎంపిక సింపుల్ అండ్ స్వీట్ అనిపించే పాటలలో ఇదీ ఒకటి... మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : రాధాకళ్యాణం (1981)సంగీతం : కె.వి....

శనివారం, ఫిబ్రవరి 22, 2014

దిక్కులు చూడకు రామయ్యా

రేడియోలో విన్న పాటలలో ఇది కూడా ఒకటి. పాటలంటే బాలు గారి గొంతో ఘంటసాల గారి గొంతో తప్ప మిగిలిన గొంతులు ఏవీ పెద్దగా వినపడని ఆ రోజుల్లో మరో కొత్త గొంతు ఏది వినపడినా కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపించి చెవులు రిక్కించి వినేటైమ్ లో ఈ జి.ఆనంద్ గారి పాటలు కూడా ప్రత్యేకంగా అనిపించేవి. మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : కల్పన (1977)సంగీతం : చక్రవర్తిసాహిత్యం : వేటూరి  గానం : సుశీల, జి.ఆనంద్ ఓఓ.ఓ..ఓ.ఓఓ.. దిక్కులు...

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2014

తొలిచూపు ఒక పరిచయం

టీవీలు రాకముందు నేను రేడియోలో విన్న మరిచిపోలేని పాటలలో ఇదీ ఒకటి. సాలూరు వారు, రాజన్-నాగేంద్ర, రమేష్ నాయుడు గార్ల పాటలు రేడియోలో వింటూ పెరగడం నాకు కలిగిన అదృష్టాలలో ఒకటి. ఈ పాటలలోని సంగీత సాహిత్యాల గొప్పదనం ఒక ఎత్తైతే ఈ పాటలు విన్నపుడల్లా నా మనసు ఆనాటి మధుర జ్ఞాపకాలలోకి పరుగులు తీయడం ఈ పాటలు నేనింతగా ఇష్టపడడానికి మరో కారణం. ఈ చక్కని పాట మీరూ విని చూసీ ఆస్వాదించండి..  ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : అద్దాలమేడ(1981) సంగీతం...

గురువారం, ఫిబ్రవరి 20, 2014

డ్రీమ్ గర్ల్..

సిరివెన్నెల అంటే క్లాసికల్ పాటలనే కాదు ఇలాంటి అల్లరి పాటలను సైతం తెలుగు ఇంగ్లీష్ కలిపి కూడా అందంగా రాయగలరు ఆకట్టుకోగలరు అని నిరూపించిన పాట. కృష్ణవంశీ మొదటి మాజిక్ "గులాబి" నుండి. శశిప్రీతమ్ అప్పట్లో గొప్ప యూత్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడని మాకాలేజ్ లో అందరం ఫిక్స్ అయిపోయాం కానీ ఎందుకో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఎపుడు విన్నా నా కాలేజ్ రోజులని గుర్తు చేసే ఈ పాటని మీరూ విని ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినండి. చిత్రం :...

బుధవారం, ఫిబ్రవరి 19, 2014

తప్పట్లోయ్ తాళాలోయ్..

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము నువ్వూ విశ్వనాథ్ గారి లేటెస్ట్ సినిమా శుభప్రదంలో ఈ పాట చాలా బాగుంటుంది, శివకేశవులు ఒకటేనంటూ పోలికలు చూపే ప్రయత్నం చేసిన చరణం కానీ పల్లవిలోని వాక్యాలు కానీ చక్కని సాహిత్యం, ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఒకప్పటి విశ్వనాథ్ సినిమాలతో పోల్చలేకపోయినా ఈకాలం స్టాండర్డ్స్ కి చక్కని సంగీత సాహిత్యాల మేళవింపే. రౌతుకొద్దీ గుర్రమనే సామెత మోటుగా ఉన్నా దర్శకుడిని బట్టే పాటల రచయిత ప్రతిభ అని ఈపాటతో మరోసారి రుజువైంది. సేమ్యా ఉప్మా...

మంగళవారం, ఫిబ్రవరి 18, 2014

నీతో ఏదో అందామనిపిస్తుంది

కృష్ణవంశీ సిరివెన్నెల కాంబినేషన్ లో సాయికార్తీక్ సంగీత దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన మరో మంచి మెలోడి ఇది, సిరివెన్నెల తనమాజిక్ చూపించేస్తే కృష్ణవంశీ తన ఓల్డ్ స్టైల్లో చిత్రించిన చిత్రీకరణ సైతం ఆకట్టుకుంటుంది. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ వీడియో ఒక నిముషం ప్రోమోషనల్ వీడియో మాత్రమే. యూట్యూబ్ లో ఫోటోలు ప్లస్ పూర్తిపాట ఆడియోతో చేసిన ప్రజంటేషన్ ఇక్కడ చూడవచ్చు లేదా ఆడియో మాత్రమే రాగాలో ఇక్కడ వినవచ్చు. చిత్రం : పైసా (2013)సంగీతం : సాయి కార్తీక్సాహిత్యం : సిరివెన్నెల...

సోమవారం, ఫిబ్రవరి 17, 2014

ఉయ్యాలైనా జంపాలైనా

కొత్త దర్శకులనుండీ కొత్త సంగీత దర్శకులనుండి మంచి పాటలు ఆశించడం ఎపుడో మానేసిన నాకు ఇటీవల విడుదలైన ఉయ్యాల జంపాల లోని ఈపాట బాగా నచ్చింది, సీతారాములని మళ్ళీ మనలా పుట్టించాడు అని అనుకోవడం ఆ తర్వాత సాహిత్యంలో వాసు వలభోజు ఉపయోగించిన చక్కని తెలుగు చూస్తే ఈ టీమ్ నుండి మరిన్ని మంచి పాటలు ఆశించవచ్చునేమో అనిపించింది, సన్నీ మ్యూజిక్ కూడా చాలా సూతింగ్ గా ఉంది. ఈపాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. అలాగే ఎంబెడ్ చేసిన వీడియో ముప్పై సెకన్ల ప్రోమో మాత్రమే...

ఆదివారం, ఫిబ్రవరి 16, 2014

వేవేలా వర్ణాలా

కొన్నేళ్ళ క్రితం ఓసారి ఈ పాట వింటూ టైప్ చేసుకున్నపుడు నేను రాసుకున్న మాటలు "ఈ మధ్య కాలం లో ఇంత ఆస్వాదిస్తూ రాసుకున్న పాట లేదు... ఆ తన్మయత్వం లో సిరివెన్నెల గారిని ఏమని పొగడాలో కూడా తెలియడం లేదు..." నేటికీ ఈ పాట వింటున్నపుడు నాలో అవే ఫీలింగ్స్... ఈ సినిమాలోని ప్రతిపాట నాకు చాలా ఇష్టమైనా ఈ పాట మరింత ఎక్కువ ఇష్టం. సిరివెన్నెల, ఇళయరాజా, బాలు, గీతాకృష్ణలు కలిసి చేసిన మాజిక్ మీరూ చూసి విని ఆనందించండి. ఆడియోమాత్రం కావాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం...

శనివారం, ఫిబ్రవరి 15, 2014

ముద్దుల జానకి పెళ్ళికి

నిన్నటిదాకా ప్రేమ గీతాలలో ఓలలాడాముగా ఇక తర్వాతేముంటుంది పెళ్ళే మరి :-) పెద్దరికం సినిమాలోని ఈ పెళ్ళిపాట నాకు చాలా ఇష్టం. నిజానికి దీనిని పెళ్ళి ఏర్పాట్ల పాట అని చెప్పాలేమో, చిత్రీకరణ చాలా బాగుంటుంది అచ్చ తెలుగమ్మాయిగా సుకన్య తనకు బామ్మగారిగా భానుమతి గారు కూడా బాగుంటారు. ఈ చక్కని పాట మీరూ చూసి విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం : పెద్దరికం (1992) సంగీతం : రాజ్-కోటి సాహిత్యం : భువనచంద్ర, వడ్డేపల్లి కృష్ణ గానం...

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ...

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు... గత నెలరోజులుగా బోలెడు ప్రేమ గీతాలని చూస్తూ వింటూ రోజంతా ప్రేమమయం చేసుకుంటూ ఆనందంగా గడిపాము కదా మరి ఈ రోజు ప్రేమికులరోజు సంధర్బంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు :-) ఈ ప్రత్యేకమైన రోజు తెలుగు సినీ ప్రపంచంలో మూడు తరాలకు చెందిన మూడు ప్రేమ పాటలను మీతో పంచుకుందామని తీసుకు వచ్చేశాను.  సంతానం సినిమా కోసం ఘంటసాల గారు పాడిన ఈ "చల్లని వెన్నెలలో" పాట చాలా బాగుంటుంది, ముఖ్యంగా ప్రారంభంలో వచ్చే ఆలాపన వింటూంటే నిజ్జంగా...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.