ఆదివారం, అక్టోబర్ 13, 2019

పాడు కబురు వినగానే...

కిడ్నాప్ చేసి ఇలా పేరడీ పాటల రూపంలో టెన్షన్ పడి నవ్వించడం వర్మ స్కూల్ కే చెల్లింది. ఆ సరదా క్రైమ్ కామెడీని  మీరూ విని చూసీ నవ్వుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనీ (1993)
సంగీతం : శ్రీమూర్తి (శ్రీ)
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : మనో, జె.డి.చక్రవర్తి, చిత్ర

(మావి చిగురు తినగానే)
 పాడు కబురు వినగానే..ఏ..
పైకం తెస్తాడా..ఆ.. పైకం తెస్తాడా
ఎవ్వడి బాబు సొమ్మంటూ
వైఫు గొంతు కోస్తాడా
ఏమో ప్లానేశాం గానీ
పార్టనరూ డబ్బురా
పాడు కబురు వినగానే
పైకం తెస్తాడా..అయ్యయయ్యో..
పైకం తెస్తాడా...

(జామురాతిరి జాబిలమ్మ)
నోరు మూయరా పిరికి పంద
శుభం పలకవా.. ఊహూ..
ఆది లోనే హంస పాదా
రేయ్.. ఆశ లేదా.. ఏంటీ.. ఊహూ..
సపోజ్ ఖర్మ కాలిపోతే
సడన్ గ దారి మారిపోతే
పదేళ్ళు కఠిన ఖైదు అంతే..

(ఇంతేనయా తెలుసుకోవయా)
ఇదిగో మనీ ఎటున్నా విని
ఇలారా కిడ్నాపరూ
రా..రా..రాఅ..రా...రా.. హహ
వదిలేయ్ మరి నా ఇల్లాలిని
నా ఇంటికి చిరుదివ్వెనీ
ఆస్థీ పాస్థీ బలాదూరేరా
నా దేవేలే మిన్నా...
బం చిక్ బంబం బబుచిక్ బంబం
బాబా బీబీబాబాబీబి.బా..

ఓయే ఓయే ఓయేఓయే
ఓయేఓ ఊవ్వా..

(నీ జత లేక పిచ్చిది కాదా)
ప్రాణాలైనా ఇస్తాకానీ మానేనా
పాతాళానా నిను పాతేయ్ నీ రాలేనా
పాతాళానా నిను పాతేయ్ నీ రాలేనా
ప్రాణం కన్నా పెళ్ళాం మిన్నా అంతేగా
నీ చేతుల్లో చచ్చే భాగ్యం నాదేగా.. ఆఅ..
నీ చేతుల్లో చచ్చే భాగ్యం నాదేగా.. హహహ..

(యురేకా సకామికా)
యురేకా సకామికా 
తొక్కింది నక్కతోకా
నెగ్గింది చిట్కా పండూ..
దక్కింది చక్కా ఫండూ
దొరికెరా ఈజీ ఫినాన్సు
జరుపుకో క్రేజీ రొమాన్సు
యురేకా సకామికా
తొక్కింది నక్కతోకా

(ముద్ద బంతి పూలు పెట్టి)
పెళ్ళి ఈడు పిల్ల ఉండీ
కళ్ళముందే అల్లుడుండీ
అల్లుడుండీ
టైమ్ వేస్ట్ చేస్తారేంటి
మావయ్యా.. ఫాదరిన్లా..
మా మ్యారేజికి
లేటవుతుంది నీవల్లా

(ఎన్నాళ్ళో వేచిన ఉదయం)
ప్రాపర్టీ పైసా లేదే
పోషించే పథకం లేదే
పెళ్ళానికి ఫుడ్డేమిట్రా
పచ్చగడ్డి పెడతావా
పోరా సోంబేరి గాడా
నీ ఫేసుకి పెళ్ళొకటా
నీకె ఓ కంత లేదే
నీ మెడలో డోలొకటా

(వాన జల్లు గిల్లుతుంటే)
కన్నెగానే ఉండిపోనా కన్నతండ్రీ
పెళ్ళి ఊసే మరిచి పోనా పిచ్చితండ్రీ
ముల్లె తెచ్చాడుగా పిల్లడూ
ముళ్ళు వేయించవా ఇప్పుడే 
 
(థమ్సప్ యాడ్)
రూపాయ్ లొచ్చే సంబరం
లాల్లా..లాల్లా..
పాపాయ్ నిచ్చే సంబరం
లాల్లా..లాల్లా..
సొమ్మొకళ్ళదీ సోకొకళ్ళదీ
గప్ చుప్ గప్ చుప్
రిఫ్రెషింగ్ కోలా
రిఫ్రెషింగ్ కోలా థమ్సప్.. 


4 comments:

ఈ మూవీలో కామెడీ అద్భుతహ..

అవునండీ.. అప్పట్లో సూపర్ హిట్ కదా.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

థాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.