గురువారం, అక్టోబర్ 24, 2019

భామనే.. సత్య భామనే..

సప్తపది చిత్రంలోని ఈ పాట లిరిక్స్ పరంగా కన్నా టేకింగ్ పరంగా మంచి పేరడీ. ఓ సగటు మధ్యతరగతి ఇంటికి కోడలిగా వచ్చిన నాట్యకళాకారిణి గురించి చుట్టుపక్కల అమ్మలక్కలు ఆవిడ ఇంటి పనులు ఎలా చేస్తుందో ఎలా ఊహించుకోవచ్చు అనే సరదా ఆలోచనలోంచి పుట్టిన పాట ఇది. ఒరిజినల్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : మంగు జగన్నాథ కవి (భామాకలాపం) 
గానం : జానకి

భామనే! సత్య భామనే!
సత్య భామనే.. సత్య భామనే
సత్య భామనే..ఏ..ఏ..ఏ సత్య భామనే

వయ్యారి ముద్దుల!
వయ్యారి ముద్దుల సత్యా భామనే..ఏ
సత్య భామనే


భామనే పదియారువేల
కోమలులందరిలోనా
భామనే పదియారువేల
కోమలులందరిలో
లలనా! చెలియా!
మగువా! సఖియా!
రామరో గోపాలదేవుని
ప్రేమను దోచినదాన!
రామరో గోపాలదేవుని
ప్రేమను దోచిన
 
సత్య భామనే..ఏ..
సత్యా భామనే

ఇంతినే..ఏ, చామంతినే..ఏ..
మరుదంతినే..ఏ, విరిబంతినే..ఏ.
ఇంతినే చామంతినే
మరుదంతినే విరిబంతినే
జాణతనమున సతులలో
జాణతనమున సతులలో
నెరజాణనై! నెరజాణనై!
నెరజాణనై వెలిగేటిదాన 

భామనే..ఏ.., సత్య భామనే!

అందమున ఆనందమున
గోవిందునకు నెరవిందునై
అందమున ఆనందమున
గోవిందునకు నెరవిందునై
నందనందను నెందు గానక
నందనందను యెందు గానక
డెందమందును క్రుంగుచున్న 

భామనే..ఏ..ఏ.. సత్య భామనే!
సత్య భామనే..ఏ.. సత్య భామనే 



2 comments:

విశ్వనాథ్ గారి అందమైన ఊహకి జోహార్లు..

అవునండీ విశ్వనాథ్ గారి ఊహ టూమచ్ అసలు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.