ఆదివారం, అక్టోబర్ 27, 2019

ఇన్నాళ్ళకొచ్చింది...

మిత్రులందరకూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముద్దుల మనవరాలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ముద్దుల మనవరాలు (1986)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి    
గానం : బాలు

ఇన్నాళ్ళకొచ్చింది దీపావళి
తీపి కన్నీటి ప్రమిదల్లో కళికావళీ
దీపకళికావళీ
అమ్మమ్మ మనసులో
అమావస్య బ్రతుకులో
మనవరాలు తెచ్చింది
మమతల దీపావళి

ఇన్నాళ్ళకొచ్చింది దీపావళి
తీపి కన్నీటి ప్రమిదల్లో కళికావళీ
దీపకళికావళీ 

చిట్టి చిట్టి అలకలూ చిటపటలూ
చిలిపి చిలిపి అల్లరులే
సీమ టపాకాయలు
వెలుగుల సురపున్నలూ చిచ్చుబుడ్లు
చీకటికీ చింతలకీ జవాబులే మతాబులు
అమ్మమ్మ కళ్ళలో ఎన్ని వెలుగు నీడలో
అమ్మమ్మ కళ్ళలో ఎన్ని వెలుగు నీడలో
ఈ వెలుగుకు తోడు నీడ ఎవ్వరో ఎప్పుడో

ఇన్నాళ్ళకొచ్చింది దీపావళి
తీపి కన్నీటి ప్రమిదల్లో కళికావళీ
దీపకళికావళీ
అమ్మమ్మ మనసులో
అమావస్య బ్రతుకులో
మనవరాలు తెచ్చింది
మమతల దీపావళి


4 comments:

thank you for posting Deepavali song lyrics

మీకూ మీ కుటుంబ సభ్యులకూ బిలేటెడ్ దీవాలి విషెస్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.. మీక్కూడా దీపావళి శుభాకాంక్షలు..

థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ వేటూరి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.