గురువారం, అక్టోబర్ 31, 2019

ఓం నమో వెంకటప్పాయా...

సీమటపాకాయ్ సినిమాలోని ఈ పేరడీని మొదటి సారి చూసినపుడు పగలబడి నవ్వుకున్నాను. పాటల సెలక్షన్ పారడీ భలే కుదిరాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సీమటపాకాయ్ (2011) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం : ??? గానం : (సదాశివా సన్యాసి తాపసి) ఓం నమో వెంకటప్పాయా ఓం నమో నాటుబాంబాయా ఓం నమో ఫ్యాక్షనిష్టూ రూపాయా ప్రతాపాయా గబ గబ బాంబులు విసిరే పురుషాయా...

బుధవారం, అక్టోబర్ 30, 2019

ఇది శృంగార గంగావతరణం...

అహనా పెళ్ళంట చిత్రంలోని ఒక సరదా పేరడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో రెండు పాటలతో విడుదల చేసినా వీడియో మాత్రం యారుకాగ అనే తమిళ్ పాట, మేరే అంగనేమే అన్న ఫేమస్ హిందీ పాట ఉపయోగించారు. ఇక మధ్యలో వచ్చే నిర్మా తమిళ్ యాడ్, లైఫ్ బాయ్ హిందీ యాడ్ క్రేన్ వక్కపొడి తెలుగు యాడ్ మరింత నవ్విస్తాయ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అహనా పెళ్ళంట (1987) సంగీతం : రమేష్...

మంగళవారం, అక్టోబర్ 29, 2019

కాఫీ దండకం...

ఈ మధ్య ఆరోగ్య రీత్యా రకరకాల టీలని ఆదరిస్తున్నారు కానీ ఒకప్పుడు సౌతిండియా అంతటా కాఫీకే పెద్ద పీట వేసేవారు. మరి అలాంటి కాఫీని సేవించిన జొన్నవిత్తుల గారు ఆ కాఫీని ఏవిధంగా దండకంతో పొగుడుతున్నారో మీరే చూడండి. సాధారణంగా దేవతలకోసం భక్తులు రాసి గానం చేసే ఈ దండకానికి పేరడీగా జొన్నవిత్తుల గారి దండకం కాఫీ ప్రియులందరిని అలరిస్తుందనటంలో ఏ సందేహం లేదు. మిధునం చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో...

సోమవారం, అక్టోబర్ 28, 2019

అమ్మలారా అయ్యలారా...

కోతిమూక చిత్రంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ పేరడీ సాంగ్స్ తో ఎలా చేశారో మీరూ వినీ చూసి నవ్వుకోండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కోతిమూక (2010) సంగీతం : మణిశర్మ  సాహిత్యం : రామజోగయ్య/భాస్కరభట్ల ?? గానం : దీపు, శ్రీకృష్ణ, రేవంత్ (రింగ రింగ రింగ రింగ) అమ్మలారా అయ్యలారా అంజిగాడికి ఓటు వెయ్యండి అందరికి తెలిసినోడు ఈడు చాలా మంచివాడండీ మందిసొమ్మే ఎనకేసుకోడూ...

ఆదివారం, అక్టోబర్ 27, 2019

ఇన్నాళ్ళకొచ్చింది...

మిత్రులందరకూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముద్దుల మనవరాలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ముద్దుల మనవరాలు (1986) సంగీతం : బాలు సాహిత్యం : వేటూరి     గానం : బాలు ఇన్నాళ్ళకొచ్చింది దీపావళి తీపి కన్నీటి ప్రమిదల్లో కళికావళీ దీపకళికావళీ అమ్మమ్మ మనసులో అమావస్య బ్రతుకులో మనవరాలు...

శనివారం, అక్టోబర్ 26, 2019

గాంధీని చంపిన (లంచం మంచం)...

పేరడీ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి జొన్నవిత్తుల గారు రాసిన ఓ చక్కని పేరడిని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట పలు పాటల మెడ్లీ కనుక ఆయా పాటలను బ్రాకెట్స్ లో ఇస్తున్నాను తప్ప లింక్ ఇవ్వడం లేదు. దేశ దుస్థితిని సరదా పేరడీ పాటల్లో నవ్వుకునేలా చెప్పడం జొన్నవిత్తుల గారికే చెల్లింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : గ్యాంగ్ వార్ (1998) సంగీతం : రాజ్-కోటి  సాహిత్యం...

శుక్రవారం, అక్టోబర్ 25, 2019

ముష్టి కళ వచ్చేసిందే బాలా...

ప్రేమించుకుందాంరా సినిమాలోని పెళ్ళికళ వచ్చేసిందే బాల పాట తెలియని వాళ్ళుండరేమో కదా. ఒకప్పుడు పెళ్ళిళ్ళ ఆర్కెస్ట్రాలో ఊపేసిన పాట. దానికి పేరడీనే ఉల్టాపల్టా చిత్రంలోని ఈ సరదా పాట. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఉల్టా పల్టా (1998) సంగీతం : ఎమ్.ఎమ్.శ్రీలేఖ   సాహిత్యం : పొలిశెట్టి   గానం : ప్రణయ్, శైలజ  ముష్టి కళ వచ్చేసిందే బాలా చేత చిప్పట్టుకు...

గురువారం, అక్టోబర్ 24, 2019

భామనే.. సత్య భామనే..

సప్తపది చిత్రంలోని ఈ పాట లిరిక్స్ పరంగా కన్నా టేకింగ్ పరంగా మంచి పేరడీ. ఓ సగటు మధ్యతరగతి ఇంటికి కోడలిగా వచ్చిన నాట్యకళాకారిణి గురించి చుట్టుపక్కల అమ్మలక్కలు ఆవిడ ఇంటి పనులు ఎలా చేస్తుందో ఎలా ఊహించుకోవచ్చు అనే సరదా ఆలోచనలోంచి పుట్టిన పాట ఇది. ఒరిజినల్ వర్షన్ ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : సప్తపది (1981)సంగీతం : కె.వి.మహదేవన్ సాహిత్యం : మంగు జగన్నాథ కవి...

బుధవారం, అక్టోబర్ 23, 2019

రంజుభలే రాంచిలక...

మావిచిగురు సినిమాలో అల్లురామలింగయ్య గారు జీన్స్ పాంట్ వేస్కుని అమ్మాయిల వెంటపడుతూ ఆటపట్టించే ఈ పాటను రంజుభలే రాంచిలుక అన్న రాజబాబు గారి పాటలోని పదాలను వాడి అల్లు గారిదే ముత్యాలూ వస్తావా అన్న పాట  బాణీలో స్వర పరిచిన పేరడీ పాట. ఈ పాట వీడియో దొరకలేదు. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఆడియో సాంగ్ ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మావిచిగురు (1996) సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు,...

మంగళవారం, అక్టోబర్ 22, 2019

ఆవకాయ మన అందరిదీ...

బృందావనమే కాదండోయ్ ఆవకాయ కూడా మన అందరిదేనట అప్పదాసు గారి మాటల్లో మీరూ వినండోమారు. మిథునం చిత్రంలోని ఈ చక్కని పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. బృందావనమది అందరిది పాట ఇక్కడ చూడవచ్చు. చిత్రం : మిథునం (2012)సంగీతం : వీణాపాణి సాహిత్యం : తనికెళ్ళ భరణి గానం : బాలు, స్వప్న ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలేఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలేఎందుకు పిజ్జాల్ ఎందుకు బర్గర్...

సోమవారం, అక్టోబర్ 21, 2019

కాటమ రాయుడా...

అత్తారింటికి దారేది చిత్రంలో బాగా ఫేమస్ అయిన కాటమరాయుడా కదిరి నరసింహుడా పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట లిరిక్స్ పేరడీ కాకపోయినా చిత్రీకరణ పేరడీగానే అనుకోవచ్చు. ఒరిజినల్ భజన పాటను బాలమురళి కృష్ణ గారి గాత్రంలో ఇక్కడ వినవచ్చు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అత్తారింటికి దారేది (2013) గానం : పవన్ కళ్యాణ్  హేయ్.. కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..అకాటమ రాయుడా కదిరీ నరసింహుడా..ఆకాటమ...

ఆదివారం, అక్టోబర్ 20, 2019

ఎంకమ్మా... ఓ నా ఎంకమ్మా..

శ్రీదేవి అనిల్ కపూర్ ల చాందినీ పాటకు పేరడీగా వచ్చిన ఈ బ్రహ్మానందం పాటను ఈ రోజు తలచుకుని నవ్వుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : పెళ్ళామా మజాకా (1993) సంగీతం : రాజ్-కోటి సాహిత్యం : సాహితి గానం : మనో , శైలజ ఎంకమ్మా .. ఓ నా ఎంకమ్మా.. ఏందమ్మో ఆ నడకా పడిచస్తానే నీ ఎనకా నీకూ నాకూ బిగుసుకు పోయే లింకమ్మో ఎంకమ్మా ఓ నా ఎంకమ్మా.. ఏందమ్మో ఆ నడకా...

శనివారం, అక్టోబర్ 19, 2019

ఆడ్డవే మయూరే...

చెల్లెలి కాపురం చిత్రంలోని "చరణ కింకిణులు" పాటకు పేరడీగా ఇంకా చెప్పాలంటే సంగీతకారులమని చెప్పుకునే కొందరు నాదబ్రహ్మలు పాటలను ఎలా ఖూనీ చేస్తారో చూపిస్తూ చిత్రీకరించిన శుభాకాంక్షలు సినిమాలోని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : శుభాకాంక్షలు (1997) సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం : గానం : మనో  చరణ కొంకిణులు గొల్లు గొల్లుమన...

Page 1 of 28312345Next

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.