బుధవారం, సెప్టెంబర్ 05, 2018

పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు...

ఈరోజు గురుపూజోత్సవం సంధర్బంగా గురువులకు శిష్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ఆనందభైరవి చిత్రంలోని ఈ శ్లోకం తలచుకుందాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.



​గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరా
గురుర్దేవో మహేశ్వరా
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
 తస్మై శ్రీ గురువే నమ: తస్మై శ్రీ గురువే నమ:


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఈనాటి పెళ్ళిపాట పెళ్ళిపీటలు చిత్రం లోనిది.. సరదా అయిన ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళిపీటలు (1998)
సంగీతం : ఎస్వీ కృష్ణారెడ్డి  
సాహిత్యం : చంద్రబోస్
గానం : మనో, నిత్యసంతోషిణి, బృందం

పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు స్వాగతమన్నాయి
పెళ్ళి పల్లకీ పెళ్ళి పందిరి సిద్ధంగున్నాయి

మేళమే మోగగా మారనా ఆలిగా
వేద బ్రాహ్మణులు వేల బంధువులు
వేచి ఉన్న సమయంలో

పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు స్వాగతమన్నాయి
పెళ్ళి పల్లకీ పెళ్ళి పందిరి సిద్ధంగున్నాయి

సప్తవర్ణములతో తమాషగ నడిచాయి రంగవల్లు
హోయ్ రంగవల్లులు హోయ్ రంగవల్లులు
హోయ్ రంగవల్లులు హోయ్ రంగవల్లులు

సప్తపదిని కనగా అదిగో
మండపాన మావిడాకు మెరిసే
అష్టపదులు పలుకా ఇదిగో
ఇంటిముందు కొబ్బరాకు నిలిచే

కర్పూరము పన్నీటి కలశం
ఖర్జూరము పారాణి పాదం
తాళిబొట్టు జిలకర్ర బెల్లం
వేచివుంది వేదమంత్ర గానం

ప్రేమ సాక్షులం అక్షతలే వేసేస్తాం
పెళ్ళి సాక్షిగా అశీస్సే అందిస్తాం
శుభలగ్నం తిలకిస్తాం శుభమస్తు దీవిస్తాం
ప్రేమసాక్షులం

పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు స్వాగతమన్నాయి
పెళ్ళి పల్లకీ పెళ్ళి పందిరి సిద్ధంగున్నాయి

ఈడు జోడు చూసి హుషారుగ కురిశాయి తేనెజల్లులు
హాయ్ తేనెజల్లులు హోయ్ తేనెజల్లులు
హాయ్ తేనెజల్లులు హోయ్ తేనెజల్లులు

విడిది వారికోసం అదిగో
దప్పళాలు అప్పడాలు దోశలు
విందు భోజనార్థం ఇదిగో
చక్కిలాలు బాదుషాలు బూరెలు

నేతిగారెలు జాంగ్రీలు లడ్లు
తీపి అరిసెలు వడియాలు వడలు
ముద్దపప్పు ఆవకాయ పెరుగు
జీడిపప్పు మునక్కాయ పులుసు హో..

పెళ్ళిభోజనం ఇవ్వాళే తయ్యారే
విందుభోజనం వహ్వారే నోరూరే
కడుపారా తినరారే తినిపోదాం మన ఊరే
పెళ్ళి భోజనం..

పెళ్ళి పీటలు పెళ్ళి పాటలు స్వాగతమన్నాయి
పెళ్ళి పల్లకీ పెళ్ళి పందిరి సిద్ధంగున్నాయి

మేళమే మోగగా మారనా ఆలిగా
వేద బ్రాహ్మణులు వేల బంధువులు
వేచి ఉన్న సమయంలో


2 comments:

గురుపూజ పిక్ చాలా బావుందండి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.