మంగళవారం, సెప్టెంబర్ 25, 2018

కోటలోని రాణి...

ఈశ్వర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఈశ్వర్ (2003)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కౌసల్య, లెనిన, నిహాల్, రాజేష్, ఉష

కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా
మేడలలో దొరసాని మా వాడ చూశావా
గాలి కూడా రాని గల్లీ లోనే కాపురముంటానంటావా
పేదల బస్తీలోనే నీ గూడు కడతావా

ఎప్పుడూ తోటరాముణ్ణే కోరుకుంటుంది యువరాణీ
ఎందుకో ఏమో ప్రేమనే అడిగి తెలుసుకోవచ్చుగా


కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా
మేడలలో దొరసాని మా వాడ చూశావా


ఎపుడూ నీ పైన పడదే చినుకైనా
గొడుగై ఉంటాగా నేనే నీతో
ఇక పై ఎవరైనా వెతకాలనుకున్నా
కొలువై ఉంటాలే నేనే నీలో

నూరేళ్ల పాటు నేనే నీ చుట్టూ కంచై కాపాడనా

డాకటేరు కాడు ఇంజినీరు కాడు ఊరు పేరు లేనోడు
ఎందుకు నచ్చాడమ్మా ఇటువంటి కుర్రాడు


మొండి సచ్చినోడు కొండముచ్చుగాడు
నిన్నెట్టా సుఖపెడతాడు
భూమ్మీదెవడూ లేడా ఇంతోటి మగవాడు


ఇష్టమైనోడె ఈశ్వరుడు
మనసు పడినాడే మాధవుడు
ప్రేమ పుట్టాక పిచ్చి పట్టాక ఆశ ఆగదు కదా


నగలే కావాలా వగలే వెలిగేలా
ఒక్కో ముద్దు తాకే వేళ

సిరులే ఈ వేళ మెడలో వరమాల
మహరాజంటేనే నే కాదా
ఏదో సంతోషం ఏదో ఉత్సాహం
వేరే జన్మే ఇదా


సత్తు గిన్నెలోని సద్ది బువ్వతోనే సర్దుకుపోగలనంటావా
అపుడపుడు పస్తుంటూ అలవాటు పడగలవా

ఉప్పుఎక్కువైనా గొడ్డు కారమైనా ఆహా ఓహో అనగలవా
ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ కూడు తినగలవా


పంచదారంటి మమకారం పంచిపెడుతుంటే సంసారం
పచ్చిమిరపైన పాయసం కన్నా తీయగా ఉండదా 


4 comments:

వైటింగ్ ఫర్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ..

చాలా లార్జ్ స్కేల్ లో హాలీఉడ్ రేంజ్ లో తీస్తున్నారటండీ.. నేను కూడా వెయిటింగ్.. థాంక్స్ ఫర్ ద కామెంట్..


ఏమిటండీ కొన్నాళ్ళ నుంచి వరస బెట్టి పెళ్ళి పాటలతో "మార్మోగించేస్తున్నారు " :)


ఏమన్నా విశేషమా :)



జిలేబి

ఏం లేదు జిలేబిగారు.. నా బ్లాగ్ లో నెలకో సిరీస్ రన్ చేయడం అలవాటు.. అలాంటి అనేకానేక సిరీసుల్లో ఈ నెల శ్రావణమాసం అని పెళ్ళిపాటల సిరీస్ రన్ చేస్తున్నాను అంతే..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.