మంగళవారం, ఆగస్టు 09, 2016

కురిసింది వానా...

సత్యం గారు స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఇదే పాటను పారడీగా చిత్రీకరించిన కొంటెమొగుడు పెంకిపెళ్ళాం(1980) చిత్రం లోనిది. ఒరిజినల్ వీడియో దొరకలేదు.


చిత్రం : బుల్లెమ్మ బుల్లోడు (1972)
సంగీతం : సత్యం
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుశీల

కురిసింది వానా.. నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా
కురిసింది వానా.. నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా
ముసిరే మేఘాలు.. కొసరే రాగాలు
కురిసింది వానా.. నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా

అల్లరి చేసే.. ఆశలు నాలో
పల్లవి పాడేనూ..ఊ..ఊ
తొలకరి వయసు.. గడసరి మనసు
నీ జత కోరేనూ..ఊ..ఊ
అల్లరి చేసే.. ఆశలు నాలో
పల్లవి పాడేను..
చలి గాలి వీచే.. గిలిగింత తోచే

కురిసింది వానా.. నా గుండెలోనా
నీ చూపులే జల్లుగా

ఉరకలు వేసే.. ఊహలు నాలో
గుసగుస లాడేనూ..ఊ..ఊ
కథలను తెలిపే.. కాటుక కనులు
కైపులు రేపేనూ..ఊ..ఊ
ఉరకలు వేసే.. ఊహలు నాలో
గుసగుస లాడేను
బిగువు ఇంకేలా.. దరికి రావేలా

కురిసింది వానా.. నా గుండెలోనా..
నీ చూపులే జల్లుగా

2 comments:

బైట చల్లగా వర్షం పడుతుంటే..వేడిగా మిర్చి బజ్జీలు తింటూ హాపీ గా వినే పాట..

హహహ భలే చెప్పారు శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail