బుధవారం, ఆగస్టు 17, 2016

గోదావరీ పయ్యెదా.. కృష్ణమ్మ నీ వాల్జడ..

వేటూరి గారు ఓ అమ్మాయి వాలుజడను కృష్ణమ్మతో పోలుస్తూ రాసిన ఈ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ వీడియో లోడ్ కాకపోతే ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సరిగమలు (1994)
సంగీతం : బాంబే రవి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

ఆఆఆఅ..ఆఆఆ....ఆఆఅ..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
ఓ..ఓ..ఓఓఓఓఓ....
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో.. 
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో.. 

గోదావరీ పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా
నిండారి తెలుగింటి అందాలే వెలిగించే
నండూరి వారెంకిలా ఓ...

గోదావరీ ఎన్నెలా నాదారిలో కాయగా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...

గోదావరీ పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ
ఓహోహోహో..ఓహోహోహో..ఆఆ.ఆఅ.ఆఅ.ఆ

సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము...ఓఓ..
సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము
ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము
నన్నల్లుకోమంది వయ్యారము
కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో
నా స్వప్న లోకాలలో..ఓయ్.ఒయ్.ఒయ్..

గోదావరీ ఎన్నెలా నాదారిలో కాయగా

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
కవ్వాలే కడవల్లో కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో తుంటరి ఓతుమ్మెదవో
నా బాహు బంధాలలో..ఓయ్.ఓయ్..

గోదావరీ పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...
గోదావరీ పయ్యెదా కృష్ణమ్మ నీ వాల్జడా

కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో.. 
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..
ఓ..ఓ..ఓఓఓఓఓ....
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో.. 
చెక్కిలే చెమ్మ చెక్కిలాడే సయ్యా సయ్యాహో..
కొమ్మలో కొమ్మ కోయిలాలో హుయ్యా హుయ్యాహో..

 

2 comments:

అమ్మాయిల అందాన్ని పోల్చే యే అందమైన అవకాశాన్నీ వదులుకోలేదు సుమండీ మన సినీ కవులు..

కవిహృదయం అంతేకదండీ మరి :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail