శుక్రవారం, ఆగస్టు 19, 2016

మహా కనకదుర్గా...

ఈ రోజు శ్రావణ శుక్రవారం సంధర్బంగా విజయవాడలో ఆ కృష్ణమ్మ ఒడ్డున కొలువుదీరిన కనకదుర్గా దేవిని స్మరించుకుంటూ దేవుళ్ళు చిత్రంలోని ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవకపోతే వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దేవుళ్ళు (2001)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం : ఎస్.జానకి

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను
విజయుడైన అర్జునుని పేరిట
విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగా
కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే దివ్య రూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

4 comments:

కనకదుర్గ అమ్మవారి పై ఉన్న కొద్ది మూవీ సాంగ్స్ లో ఇది చాలా బావుంటుంది..

అవును శాంతి గారు.. ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా బాగుంటాయండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

very good lyrics and music in devullu picture. andari bandhuvaya is also very good song. jonnavithula very good lyrics

థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు.. అవునండీ అన్ని పాటలు బాగుంటాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.