బుధవారం, మార్చి 16, 2016

గాల్లో తేలినట్టుందే...

జల్సా సినిమాలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జల్సా (2008)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : దేవీశ్రీప్రసాద్, టిప్పు, గోపికా పూర్ణిమ

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వొళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్ బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి

హే నిదుర దాటి కలలే పొంగే
పెదవి దాటి పిలుపే పొంగే
అదుపు దాటి మనసే పొంగే...నాలో
గడపదాటి వలపే పొంగే
చెంపదాటి ఎరుపే పొంగే
నన్ను దాటి నేనే పొంగే....నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
వొళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్ బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
 
తలపుదాటి తనువే పొంగే
సిగ్గుదాటి చనువే పొంగే
గట్టుదాటి వయసే పొంగే లోలో
కనులుదాటి చూపే పొంగే
అడుగుదాటి పరుగే పొంగే
హద్దు దాటి హాయే పొంగే..నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికి

 

1 comments:


గాల్లో తేలా పేలా
బాల్లా తేలా జిలేబి భామా గాంచా
ఒళ్లో త్రుళ్ళా ఊగా
కల్లో పొంగా ధబీలు కాళ్ళో పడ్డా !

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail