మంగళవారం, మార్చి 08, 2016

మానవ జాతి మనుగడకే...

మహిళాదినోత్సవం సందర్బంగా మహిళామణులకు శుభాబినందనలు. స్త్రీమూర్తి గొప్పతనాన్ని చాటిచెప్పే ఈపాట గుర్తుచేసుకుందాం ఈరోజు. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మాతృదేవత (1969)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సి.నారాయణరెడ్డి
గానం : పి.సుశీల, బి.వసంత

మానవ జాతి మనుగడకే
ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అను రాగంలో
తరగని పెన్నిది మగువ.

మానవ జాతి మనుగడకే
ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అను రాగంలో
తరగని పెన్నిది మగువ.

ఒక అన్నకు ముద్దుల చెల్లి
ఒక ప్రియునికి వలపుల మల్లి
ఒక అన్నకు ముద్దుల చెల్లి
ఒక ప్రియునికి వలపుల మల్లి
ఒక రామయ్యకే కన్నతల్లి
ఒక రామయ్యకే కన్నతల్లి
సకలావనికే కల్పవల్లి..

మానవ జాతి మనుగడకే
ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అను రాగంలో
తరగని పెన్నిది మగువ.

సీతగా ధరణి జాతగా
సహన శీలం చాటినది
రాధగా మధుర భాధగా
ప్రణయ గాధల మీటినది
సీతగా ధరణి జాతగా
సహన శీలం చాటినది
రాధగా మధుర భాధగా
ప్రణయ గాధల మీటినది

మొల్లగా కవితలల్లగా
తేనె జల్లు కురిసినది
మొల్లగా కవితలల్లగా
తేనె జల్లు కురిసినది
లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా
సమర రంగాన దూకినది
లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా
సమర రంగాన దూకినది

మానవ జాతి మనుగడకే
ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అను రాగంలో
తరగని పెన్నిది మగువ..

తరుణి పెదవిపై చిరునగవొలికిన
మెరయును ముత్యాలసరులు
కలకంఠి కంట కన్నీరొలికిన
తొలగిపోవురా సిరులు
కన్నకడుపున చిచ్చురగిలెనా
కరువులపాలౌను దేశం
కన్నకడుపున చిచ్చురగిలెనా
కరువులపాలౌను దేశం
తల్లిని మించిన దైవం లేదని
తరతరాల సందేశం
తల్లిని మించిన దైవం లేదని
తరతరాల సందేశం

మానవ జాతి మనుగడకే
ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అను రాగంలో
తరగని పెన్నిది మగువ..
తరగని పెన్నిది మగువ..
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.