ఆదివారం, మార్చి 27, 2016

అమ్మాయి కిటికీ పక్కన...

మర్యాదరామన్న చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మర్యాదరామన్న (2010)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అనంత్ శ్రీరామ్
గానం : కారుణ్య, చైత్ర

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అక్కడ చూడు తాడి చెట్టుంది
ఆకులు ఊపి టాటా చెబుతుంది
జాబిలి ఎందుకు వెంటే వస్తుంది
నీ పైన మనసై ఉంటుంది
పైకి కిందికి ఊగే నేల ఏమంది
నువ్వు ఊ అంటేనే ఊయలవుతానంది
మీదెకి వచ్చే గాలేమనుకుంటుంది
నీ ఉసులు మోయాలంటుందీ

ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ
 
అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది
గుమ్మంలోంచెం కనబడుతుంది
గంటక్కి ఎనభై మైళ్ళ వేగంతోటి
ఏవేవో ఆలోచిస్తుంది

ఊహించని మజిలీ వచ్చింది
నాలో ఊహల్ని మలుపులు తిప్పింది
ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని
ఇట్టేనా ముందర ఉంచింది
చల్లని చీకటి చుట్టు కమ్ముకు వస్తుందీ
వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగిందీ
నిదురలోనె కవ్వించె కల కన్నా
నిజమెంతో అందంగా ఉందీ

ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ

అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి
కునుకొచ్చి వాలిపోయింది


1 comments:

కిటికీ పక్కన ఉన్నది
తటాలు నొచ్చెను జిలేబి తటపట పడుచున్
పటపట ఎనభై మైళ్ళున
అటుయిటు తడబడి అయోమయపు బండినిటన్ :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.