బుధవారం, మార్చి 30, 2016

నమ్మిన నామది...

శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని గురించి మణిశర్మ స్వరకల్పనలో వేటూరి గారు అద్భుతంగా వ్రాసిన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రాఘవేంద్ర (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : శ్రేయఘోషల్, కల్పన

హే మంత్రాలయదీప
శ్రీరాఘవేంద్ర గురునాథ
ప్రభో పాహిమాం..

శ్రీరాఘవేంద్ర గురునాథ ||9 సార్లు||

నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓఓ
నమ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురు బోధలు అమృతమయమేగా ఓఓ
చల్లని చూపులు సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత
హనుమంత శక్తిసాంద్ర హరినామ గానగీతా
నీ తుంగభధ్ర మా పాపాలే కడగంగ
తుంగాదళాల సేవా
తులసీదళాల పూజ అందుకో

నిరాశ మూగే వేళ మా దురాశ రేగే వేళ
నీ భజనే మా బ్రతుకై పోనీవా ఆఅ
పదాల వాలే వేళ నీ పదాలు పాడే వేళ
నీ చరణం మా శరణం కానీవా
మనసు చల్లని హిమవంత
భవము తీర్చరా భగవంత
మదిని దాచిన మహిమంతా
మరల చూపుమా హనుమంత
నీ వీణ తీగలో యోగాలే పలుకంగా ఆ ఆ
తుంగాదళాల సేవ
తులసీదళాల పూజ అందుకో

నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓఓ
నమ్మని వారికి తాపత్రయమేగా

వినాశ కాలంలోన ధనాశపుడితే లోన
నీ పిలుపే మా మరుపై పోతుంటే
వయస్సు పాడే వేళ వసంతమాడే వేళ
నీ తలపే మా తలుపే మూస్తుంటే
వెలుగు చూపరా గురునాథ
వెతలు తీర్చరా యతిరాజా
ఇహముబాపి నీ హితబోధ
పరము చూపే నీ ప్రియగాథ
నీ నామగానమే ప్రాణాలై పలుకంగ
తుంగాదళాల సేవ
తులసీదళాల పూజ అందుకో

నమ్మిన నా మది మంత్రాలయమేగా ఓఓ
నమ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురు బోధలు అమృతమయమేగా ఓఓ
చల్లని చూపుల సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్రా శ్రీకృష్ణ పారిజాత
హన్మంత శక్తిసాంద్ర హరినామ గానగీతా
నీ తుంగభధ్ర మా పాపాలే కడగంగ
తుంగాదళాల సేవ
తులసీదళాల పూజ అందుకో 
 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail