బుధవారం, ఏప్రిల్ 22, 2015

నా జన్మభూమి...

ఈ రోజు ఎర్త్ డే కదా... మన జన్మభూమిని తలచుకుంటూ ఈ పాట పాడుకుందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం :  సిపాయి చిన్నయ్య (1969)
సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం :  ఆరుద్ర
గానం :  ఘంటసాల

నా జన్మభూమి..భూమి..భూమి
నా జన్మభూమి..భూమి..భూమి

నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా

నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా
 
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
ఆ హా హా హా ఆ ఆ ఆహా హా హా
నడిచేదారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు

పచ్చనీ పంటలు...వెచ్చనీ జంటలు
చల్లనీ జీవితం...ఇదే నవభారతం
హాయ్ హాయ్ నా సామి రంగా...
హోయ్ హోయ్ నా సామి రంగా
 
నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా

బ్రతకాలందరూ దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే
ఆ హా హా హా ఆ ఆ ఆహా హా హా
బ్రతకాలందరూ దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే

స్వార్థమూ వంచనా లేనిదే పుణ్యము
త్యాగమూ రాగము మిళితమే ధన్యము
హాయ్ హాయ్ నా సామి రంగా...
హోయ్ హోయ్ నా సామి రంగా

నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా


1 comments:

ప్లాస్టిక్ పువ్వులని వదిలేసి ప్రకృతిని ప్రేమించే రోజు రావాలి..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail